పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కినిరాశే మిగిలింది...!సౌదీ అరేబియాలో మ‌హిళ‌లు చేయ‌కూడ‌ని ప‌నులేంటో తెలుసా.....?ప్ర‌ధాని గొంతు కోయ‌డానికి బీహారీలు సిద్ధంగా ఉన్నారు....ర‌బ్రీ దేవి తీవ్ర‌వ్యాఖ్య‌లుజూలీ 2 ఇది ఒక సౌత్ హీరోయిన్ రియల్ స్టోరీ..తీవ్ర అసంతృప్తిలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి..!! వైసీపీకి గుడ్‌ బై ..?చంద్రబాబు రెండు సార్లు చూసిన ఆ సినిమా ఏది ?గూగుల్ ప్లే స్టోర్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ యూసీ బ్రౌజ‌ర్....!!నయనతార పారితోషికంపై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్.ఈమె మోడ‌లింగ్ ద్వారా సంవ‌త్స‌రానికి ఎంత సంపాదించిందో తెలుసా.....??ఐన్ స్టీన్ త‌న భార్యకు ఎంత దారుణ‌మైన కండీష‌న్స్ పెట్టాడో తెలుసా...??
నేషనల్

ఎయిర్ ఇండియా దేశీయ స‌ర్వీసుల్లో.. ఇక‌పై నాన్ వెజ్ బంద్?

ఎయిర్ ఇండియా దేశీయ స‌ర్వీసుల్లో.. ఇక‌పై నాన్ వెజ్ బంద్?

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా అప్పుల క‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డానికి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశీయ విమానాల్లోని ఎకాన‌మీ క్లాస్ ప్ర‌యాణికులకు మాంసాహారాన్ని రద్దు చేసింది. కేవ‌లం శాకాహారమే ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. కాస్ట్‌ కట్‌ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున‍్నట్టు వెల్ల‌డించింది. నష్టాల ఊబిలో ఇరుక్కున్న ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాకు రంగం సిద్ధమైంది. మరోవైపు ఖ‌ర్చు తగ్గించుకునే ప‌నిలో ప‌డింది ఎయిర్ ఇండియా. దేశీయ విమానాల్లో మాంసాహార భోజనం ఉండదని ఎయిర్లైన్ ఒక ప్రకటనలో పేర్కొంది. వ్యర్థాలు, ఇతర వ్యయాలు తగ్గించడం, క్యాటరింగ్ సేవలను మెరుగుపరుచుకోవడం వంటివి చర్యలు తప్పనిసరని ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్వనీ లోహని తెలియ‌జేశారు. ఇక‌పై ఎకానమీ క్లాస్‌ విమానాల్లో వెజిటేరియన్‌ ఆహారం మాత్రమే అందించనున్నట్టు వెల్ల‌డించింది. అయితే అంత‌ర్జాతీయ విమానాల్లో మాత్రం నాన్‌వెజ్ కొన‌సాగిస్తామ‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. దేశీయ‌ విమానాల్లో నాన్‌ వెజ్‌ ఫుడ్‌ ఎక్కువగా వేస్ట్‌ అవుతోందని.. ఈ నిర్ణ‌యం వ‌ల్ల ప్ర‌తియేటా 7-8 కోట్లు ఆదా అవుతుంద‌ని ఎయిరిండియా అధికారి ప్ర‌క‌టించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!