పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కినిరాశే మిగిలింది...!సౌదీ అరేబియాలో మ‌హిళ‌లు చేయ‌కూడ‌ని ప‌నులేంటో తెలుసా.....?ప్ర‌ధాని గొంతు కోయ‌డానికి బీహారీలు సిద్ధంగా ఉన్నారు....ర‌బ్రీ దేవి తీవ్ర‌వ్యాఖ్య‌లుజూలీ 2 ఇది ఒక సౌత్ హీరోయిన్ రియల్ స్టోరీ..తీవ్ర అసంతృప్తిలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి..!! వైసీపీకి గుడ్‌ బై ..?చంద్రబాబు రెండు సార్లు చూసిన ఆ సినిమా ఏది ?గూగుల్ ప్లే స్టోర్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ యూసీ బ్రౌజ‌ర్....!!నయనతార పారితోషికంపై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్.ఈమె మోడ‌లింగ్ ద్వారా సంవ‌త్స‌రానికి ఎంత సంపాదించిందో తెలుసా.....??ఐన్ స్టీన్ త‌న భార్యకు ఎంత దారుణ‌మైన కండీష‌న్స్ పెట్టాడో తెలుసా...??
నేషనల్

ఎం ఎక్సీన్ తో సెక‌న్ల‌లోనే స్మార్ట్ ఫోన్ రీఛార్జ్

ఎం ఎక్సీన్ తో సెక‌న్ల‌లోనే స్మార్ట్ ఫోన్ రీఛార్జ్

మొబైల్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ప‌వ‌ర్ త్వ‌ర‌గా చార్జింగ్ దిగిపోతే.. చిరాకు వ‌స్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ మ‌య‌మే. ఇందుకోసం శాస్త్రవేత్త‌లు కొత్త ప‌రిక‌రాన్ని క‌నిపెట్టారు. దీంతో ఇక‌పై బ్యాటరీ ఛార్జ్‌ అవ్వడానికి గంటలపాటు వేచి ఉండాల్సిన అవసరం ఉండబోదంటున్నారు. కేవలం కొన్ని సెకన్లలో పూర్తిగా నిండిపోయే బ్యాటరీలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వాటి తయారీకి అవసరమైన సరికొత్త ఎలక్ట్రోడ్‌ నిర్మాణాలను శాస్త్రవేత్తలు తాజాగా ఆవిష్కరించారు. అధిక విద్యుత్‌ వాహకత కలిగిన ఎం-ఎక్సీన్‌ అనే ద్విమితీయ పదార్థాన్ని అందుకోసం ఉపయోగించుకున్నారు. సాధారణంగా రిడాక్స్‌ క్రియాశీల కేంద్రాలను ఎక్కువగా కలిగి ఉండే పదార్థాలు ఎక్కువ శక్తిని నిల్వ చేసుకుంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అధిక వాహకత్వ సామర్థ్యంగల పదార్థాల్లో అయాన్లు చురుగ్గా చలిస్తాయని.. తద్వారా వాటికి వేగంగా ఛార్జ్‌ అయ్యే సామర్థ్యముంటుందని తెలిపారు. ఎం-ఎక్సీన్‌కు ఈ రెండు లక్షణాలూ ఉన్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా ఎం-ఎక్సీన్‌ ఎలక్ట్రోడ్‌లతో తయారయ్యే బ్యాటరీలు ఎక్కువ శక్తిని నిల్వ ఉంచుకోగలవని.. అత్యంత వేగంగా ఛార్జ్‌ అవ్వగలవని వివరించారు సైంటిస్టులు. త్వ‌ర‌లోనే స్మార్ట్ ఫోన్ వినియోగదారుల‌కు.. బ్యాట‌రీ ఛార్జింగ్ క‌ష్టాలు తీర‌నున్నాయి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!