వ్యాపారం

ఇక‌పై ఫ్లిప్ కార్ట్ లో ప‌ప్పు, బెల్లం అమ్ముతార‌ట‌?

flipcart going to sell jagger and dall
ఇక‌పై ఫ్లిప్ కార్ట్ లో ప‌ప్పు, బెల్లం అమ్ముతార‌ట‌?

ఆన్ లైన్ క‌మ‌ర్షియ‌ల్ వెబ్ సైట్.. ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో ఇంత‌కు మునుపు మొబైల్స్, మెమొరీ కార్డ్ లు.. మున్న‌గు ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునే వాళ్లు. ఇక‌పై ఆన్ లైన్ లో నిత్యావసర సరకులు విక్రయించేందుకు సిద్ధమవుతోంది ఫ్లిప్ కార్ట్. ఇప్పటికే బెంగళూరులో దీన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. దీన్ని మరింత వినూత్న రీతిలో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ సంస్థ‌. త్వ‌రలోనే హైదరాబాద్ లోనూ ప్ర‌యోగాత్మ‌కంగా నిత్యావ‌స‌ర స‌రుకులు ప్రారంభిస్తామ‌ని తెలిపారు ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్ ప్లేస్‌ హెడ్‌ అనిల్‌ గోటేటి. కొన్ని నెలల్లోనే దీన్ని ప్రారంభిస్తామని ఆయ‌న‌ పేర్కొన్నారు. ఫ్లిప్ కార్ట్ పదో వార్షికోత్సవం సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన ఈ విష‌యం వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 28 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారనీ.. సంస్థకు హైదరాబాద్‌ ఎంతో కీలకమైన ప్రాంతమని ఆయ‌న‌ పేర్కొన్నారు. ఇక్కడ 2.2లక్షల విస్తీర్ణంలోను; 50వేల చదరపు అడుగుల రెండు గోదాములు ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విజయవాడల్లో కూడా వినియోగదారులు అధిక సంఖ్యలోనే ఉన్నట్లు తెలిపారు. వీరు ఎక్కువగా దుస్తులు, మొబైల్‌ ఫోన్లు, వాటి యాక్సెసరీలు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర సౌందర్య ఉత్పత్తులను కొంటున్నారని తెలిపారు. ఈ ప్రాంతాల్లో కూడా గోదాముల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని అవసరాన్ని బట్టి, పెట్టుబడులను పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయ‌న తెలిపారు. ప్రస్తుతం మొత్తం 10 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారనీ, రానున్న ఏళ్లలో వీరి సంఖ్యను 50 కోట్లకు పెంచాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామ‌న్నారు. దుస్తులతోపాటు, ఇతర ఉత్పత్తుల్లో కూడా తమ సొంత బ్రాండ్లను అందిస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు తర్వాత కొనుగోళ్లు తగ్గిన దాఖలాలు లేవని తెలియ‌జేశారు. కొనుగోలుదారుల సౌలభ్యం కోసం చెల్లింపుల విషయంలో అనేక వెసులుబాట్లు కల్పించినట్లు.. ఇందులో ‘ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి అనే బంప‌ర్ ఆఫ‌ర్స్ కూడా ఉన్నట్లు ఫ్లిప్ కార్ట్ మార్కెట్ ప్లేస్ హెడ్.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!