ఆంధ్ర ప్రదేశ్

దేవీపట్నంలో గోదావరిలో మునిగిపోయిన లాంచీ..36 మంది గల్లంతు

boat capsized in Godavari River in Andhra Pradesh
దేవీపట్నంలో గోదావరిలో మునిగిపోయిన లాంచీ..36 మంది గల్లంతు

గత వారం పాపి కొండల యాత్రలో బోటు అగ్నిప్రమాదానికి గురై తీవ్ర నష్టం జరిగిన సంగతి మరవక ముందే తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బోటులో ఆహ్లాదకరంగా సాగాల్సిన ప్రయాణం విషాదాంతమైంది. మంగళవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య గోదావరి నదిలో లాంచీ మునిగి దాదాపు 36 మంది గల్లంతయ్యారు. కాగా 36మందిలో 16 మందికి ఒడ్డుకు చేరుకున్నారని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ తెలిపారు. బోటు ప్రమాదానికి గురైన చోట.. లోతు గుర్తించి వెలికి తీసే ఆలోచనలో ఉన్నామని కార్తికేయ చెప్పారు. నదిలో గల్లంతైన వారి ఆచూకీ గుర్తించేందుకు రాత్రి నుంచే సహాయక చర్యలు మొదలు పెట్టారు. బోటును వెలికితీసేందుకు నేవీ కూడా రంగంలోకి దిగింది. ఎన్టీఆర్‌ఎఫ్‌, పోలీస్‌ బృందాలు బోటును గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లాంచీ ఓనర్, డ్రైవర్‌ పోలీసులకు లొంగిపోయారు. లాంచీలో మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నట్టు ప్రమాదం నుంచి బయటపడిన వాళ్లు చెబుతున్నారు. వర్షం వల్ల లోపల ఉండే సిమెంటు బస్తాలు తడిచి పోతాయానే ఉద్దేశంతో లాంచీ తలుపులు మూసేయడంతో ప్రమాద సమయంలో ప్రయాణికులు బయటకు రాలేకపోయారని తెలుస్తుంది.
కాగా దేవీపట్నం బోటు ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈసీఎల్‌ నరసింహాన్‌ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు.వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని గవర్నర్‌ కోరారు. ఎప్పటికప్పుడు అధికారులను అడిగి గవర్నర్‌ సమాచారం తెలుసుకుంటున్నారు.

To Top
error: Content is protected !!