సినిమా

బ్లఫ్ మాస్టర్ సినిమా రివ్యూ …!

తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన శతురంగ వెట్టై సినిమాని తెలుగులో బ్లఫ్ మాస్టర్ గా రీమేక్ చేయడం జరిగింది …, యంగ్ టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్ మరియు ఎక్కడికి పోతావా చిన్నదాన ఫెమ్ నందిత దాస్ లు హీరో హీరోయిన్లుగా నటించగా గోపి గణేశన్ అనే యువ దర్శకుడు తెరకెక్కించడం జరిగింది ..

మంచి నటుడు అన్న పేరున్న , ఇండస్ట్రీలో పూరి , వర్మ , ప్రకాష్ రాజ్ వంటి గాడ్ ఫాదర్స్ తోడున్న , కేవలం సరైన సినిమా పడకపోవడంతో ఇంకా హీరోగా నిలదొక్కుకొని సత్య దేవ్.., ఈ బ్లఫ్ మాస్టర్ ట్రైలర్స్ లో డైనమిక్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం సరైన కంటెంట్ తో ట్రైలర్ కట్ చేయడంతో ప్రేక్షకులకు ఈసినిమాపై బారిగా అంచనాలు పెరిగాయి ..

మరి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బ్లఫ్ మాస్టర్ థియేటర్లలో వీక్షకుల అంచనాలు నిలబెట్టుకుందా , అసలేమాత్రం అంచనాలను అంచనా వేయకుండా థియేటర్లలో అడుగిడిన అతి సాధారణ ప్రేక్షకుడికి ఈ సినిమా ఎలా ఆకట్టుకొంది అన్నది మనమిప్పుడు ఈ రివ్యూలో చూద్దామా ..?

కథ కథనం విశ్లేషణ ….!

సినిమాలో కామెడీ , సాంగ్స్ , డాన్స్ , ఫైట్స్ , పంచ్ డైలాగ్స్ వంటి ఎన్నో కమర్షియల్ హంగుల్లన్న , కథలో అంతర్లీనంగా ఒక నీతిని జోడించడం చాలా గొప్ప మరియు కష్టమైనా విషయం .. ఇది పూర్తిగా దర్శకుడి యొక్క అభిరుచికి సంబందించిన విష్యం కూడా ..

అత్యుత్తమ అభిరుచితో కథ తయారైతే ఆసిన్మాకు అంతే అఖండ విజయం తోడవుతుంది .. అలాంటి కోవలోకే ఈ చిత్రం వస్తుంది .. డబ్బు అనే మదంతో సమాజంపై పడిన మనిషికి ఆహారం అయ్యేది మధ్యతరగతి వాడే అన్న నిజన్నీ మూలకథగా మలుచుకున్నా డు దర్శకుడు ..

డబ్బున్న ధనవంతుడు , సంతృప్తి వున్నా పేదవాడు కోల్పోవడానికి ఏమి వుండదు , ఊహ జనిత కోరికల్లో విహరించే మధ్యతరగతి వాళ్లే మోసపోతూ ఉంటారు , వాళ్ళ బలహీనతలే డబ్బు సంపాదించాలి అనుకునే ప్రతి ఒక్కడికి ఆహరం అవుతుంది .. ఈ డబ్బు పిచ్చి ఉన్నోడి పాత్రను సత్య దేవ్ అత్యద్భుతంగా పోషించడం జరిగింది ..

ఒక కొత్త హీరో చేస్తూన్నడన్న అభిప్రాయం ప్రేక్షకుడికి ఎక్కడ రాదు , ఒక స్టార్ హీరోను చూస్తున్న ఆరను తెరపై తెప్పించి హీరోగా సత్త చాటాడు సత్య దేవ్ .. ఇక ఎక్కడికి పోతావ్ చిన్నదానలో తనదైన నటనతో ఆకట్టుకున్న నందిత దాస్ కి సరైన పాత్ర దొరికింది …

అందాలు ఆరబోయడమే తెలుగు హీరోయిన్ల తక్షణ కర్తవ్యం అన్న పంథాను బ్రేక్ చేస్తూ మూడు వేరియేషన్స్ వున్నా క్యేరెక్టర్ ని అవలీలగా చేసేసింది .. క్యూట్ లవర్ గా , రెస్పాన్సిబుల్ వైఫ్ గా , నిండు శూలాలిగ మూడు వేరియేషన్స్ చేసి హీరోయిన్ అనే పాత్రకు న్యాయం చేసింది ..

ఇక దర్శకుడు గోపి గణేష్ కూడా ఎక్కడ తడపడకుండా ఎంచుకున్న లైన్ని పేర్ ఫెక్ట్ గ ప్రజెంట్ చేసాడు .. సినిమా మొదలైనప్పటి నుండి చివరివరకు ఆద్యంతం ఫెసి స్క్రీన్ ప్లే తో రెండు గంటల సమయాన్ని రెండు నిమిషాలకు కుదిపిన్చడా అన్న లెవెల్లో సస్పెన్స్ ని క్రేయేట్ చేసాడు ..

చివరిగా బ్లఫ్ మాస్టర్ ని అందరు పోలుస్తున్న అర్జున్ రెడ్డి , మరియు ఆర్ ఎక్స్ హండ్రెడ్ హీరోలు విజయ్ దేవరకొండ , కార్తికేయ వంటి మరో టాలెంటెడ్ హీరో తెలుగు తెరకు పరిచయమయ్యాడు అన్నది గంటాపదంగా చెప్పుకోవచ్చు ..

ఈ నటుడి ప్రతిభకు దగ్గట్టే , మంచి కథ పడటం , ఇతర సినిమా ల నుండి సరైన పోటీ లేకపోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీసునీ షేక్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ..ఈసినిమాకి మా యోయో టివి ఇస్తున్న రేటింగ్ 3. 5 అవుట్ ఆఫ్ 5

To Top
error: Content is protected !!