ఆంధ్ర ప్రదేశ్

నటుడు శివాజీపై బీజేపీ కార్యకర్తల దాడి…..

bjp supporters attack on hero shivaji
నటుడు శివాజీపై బీజేపీ కార్యకర్తల దాడి.....

సినీ నటుడు శివాజీపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. ఇదే సమయంలో నటుడు శివాజీ హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో శివాజీని చూడగానే బీజేపీ కార్యకర్తల కోపం కట్టలు తెంచుకుంది.

ప్రధాని మోదీ, బీజేపీ పార్టీపై నోటికొచ్చినట్లు మాట్లాడతావా అంటూ కొంత మంది కార్యకర్తలు శివాజీని దూషించారు. ఇదే సమయంలో కొంత మంది ఆయనపై దాడికి యత్నించారు. దీంతో విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.

బెదిరింపులకు భయపడేది లేదని శివాజీ స్పష్టం చేశారు. గత కొంత కాలంగా ఏపీ ప్రత్యేక హోదాపై గళం వినిపిస్తున్న శివాజీ.. మోదీ ప్రభుత్వం, బీజేపీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు.

To Top
error: Content is protected !!