అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
సినిమా

బిగ్ బాస్ తెలుగు సీసన్2 ఎపిసోడ్ 64 హైలైట్స్!

episode64_highlights_yoyo_daily
బిగ్ బాస్ తెలుగు సీసన్2 ఎపిసోడ్ 64 హైలైట్స్!

‘బిగ్‌బాస్‌ హౌస్‌లో కౌశల్‌తో అతిగా గొడవపెట్టుకునే కంటెస్టెంట్‌ ఎలిమినేట్ అయిపోతారు’ సీజన్ మూడో వారం నంచి ఎలిమినేషన్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి వినిపిస్తున్న మాట. దీనికి బలం ,చేకూరుస్తూ.. ఇప్పటి వరకు హౌస్ నుంచి కిరీటి, భానుశ్రీ , తేజస్వి, నందినిలు ఎలిమినేట్ అయ్యారు. తాజాగా కౌశల్ బాధితుల జాబితాలో ఇప్పుడు బాబు గోగినేని కూడా చేరి ఆదివారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

గత రెండు వారాలుగా కౌశల్‌తో గొడవలు పడుతూ.. హౌస్‌లో గేమ్‌ని మర్చిపోయిన బాబు గోగినేనీని ప్రేక్షకులు తమ ఓట్ల ద్వారా వెలుపలికి పంపించేశారు.ఈ వారం మొత్తం ఆరుగురు సభ్యులు ఎలిమినేషన్‌ కోసం నామినేషన్‌లో నిలిచారు. అందులో గీతా మాధురి, శ్యామల శనివారమే సురక్షితులవగా.. ఆదివారం రోజు తనీశ్, గణేశ్ తొలుత సేవ్ అయ్యారు.

ఆఖర్లో దీప్తి, బాబు గోగినేని నిలవగా.. ఉత్కంఠకి తెరదించుతూ హోస్ట్ నాని.. ‘బాబు గారు మీరు సహానా గారిని కలిసే టైమ్ వచ్చేసింది’ అని ఎలిమినేషన్‌ను ప్రకటించాడు. ఇటీవల ఎలిమినేషన్ టాస్క్‌లో బాబు గోగినేని సరిగా పోటీపడకుండానే ఓడిపోయానని పక్కకి తప్పుకోవడం, కంటెస్టెంట్స్‌తో రెండు నాల్కల ధోరణితో మాట్లాడటం ప్రేక్షకులకి కోపం తెప్పించాయి.

అంతేకాకుండా.. కౌశల్, గీతా మాధురిలతో గత రెండు వారాల నుంచి ఆయన వ్యవహరించిన తీరు.. హుందాగా లేదని, సోషల్ మీడియా చురుగ్గా వ్యవహరిస్తున్న ‘కౌశల్ ఆర్మీ’ గత వారం నుంచి బాబు గోగినేనీని టార్గెట్ చేసిందనే వార్తలు కూడా వచ్చాయి. గత వారం హౌస్‌మేట్స్ చేసిన తప్పుల్ని సీరియస్‌గా ఎత్తిచూపుతూ.. శనివారం వారికి చురకలు అంటించిన నాని..

ఆదివారం మాత్రం కంటెస్టెంట్స్‌కి సరదా టాస్క్ ఇచ్చి హౌస్‌లో వాతావరణాన్ని ఆహ్లాదరకరంగా మార్చే ప్రయత్నం చేశాడు. ఒక సామెత, ఒక సినిమా పేరు ఉన్న చిట్టీలు ఇచ్చి.. బొమ్మల సాయంతో వాటిని మిగిలిన కంటెస్టెంట్స్‌తో చెప్పించాలని సూచించాడు. ఈ టాస్క్‌లో రెండు గ్రూపులుగా విడిపోయిన హౌస్‌మేట్స్‌ అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

పూజా రామచంద్రన్ సంచాలకురాలిగా వ్యవహరించింది. ఎలిమినేట్ అయిన బాబు గోగినేని.. వెళ్తూ.. వెళ్తూ.. ఆనవాయితీ ప్రకారం బిగ్‌బాంబ్‌ను రోల్‌రైడాపై విసిరాడు. దీంతో.. వారం మొత్తం అతను సామ్రాట్ పర్యవేక్షణలో హౌస్‌లోని టాయిలెట్స్‌ను శుభ్రంగా ఉంచాల్సి ఉంది. ఈ ఎలిమినేషన్‌తో ఎపిసోడ్ 64 ముగియగా.. సోమవారం ప్రసారంకానున్న ఎపిసోడ్‌లో వారం ఎలిమినేషన్‌ టాస్క్‌లో కంటెస్టెంట్స్‌ పోటీపడుతున్నారు.

డేంజర్ అని సూచించే డ్రమ్ముల వద్ద కంటెస్టెంట్స్‌ నిల్చోవాల్సి ఉండగా.. పూజా, సామ్రాట్ ఒకే డ్రమ్‌ వద్ద నిల్చోవడంతో.. ఇద్దరిలో ఎవరు ఎలిమినేషన్‌లో ఉండాలో చర్చించి నిర్ణయించాలని తనీశ్, అమిత్‌లకి బిగ్‌బాస్ బాధ్యతలు అప్పగించాడు. వారు ఎవరి పేరుని సూచిస్తారో.. నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలియనుంది.

To Top
error: Content is protected !!