తెలంగాణ

కేసీఆర్ కి బిగ్ షాక్-పార్లమెంట్ లో కాలుమోపుతున్న రేవంత్

big shock to kcr about revanth reddy
కేసీఆర్ కి బిగ్ షాక్-పార్లమెంట్ లో కాలుమోపుతున్న రేవంత్

లోక్‌సభ ఎన్నికలు తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ మీద షాక్ ఇస్తున్నాయి. టి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్‌ను విమర్శించడంలో అందరికంటే ముందుండే రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరిలో విజయం సాధించారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి 6 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందారు.

దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ ఎంతగానో ప్రయత్నించింది. ఫలితాల సరళి కూడా అదే రకంగా వచ్చాయి. రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ మధ్య చివరి రౌండ్ వరకు గెలుపు దోబూచులాడుతూ వచ్చింది. అయితే చివరి రౌండ్ వరకు స్వల్ప అత్యధికను ప్రదర్శిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డిని అఖరి రౌండ్‌లో విజయం వరించింది.

ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాలను ఎవరూ ఊహించని విధంగా బీజేపీ సొంతం చేసుకుంది. ఈ షాక్ నుంచి కోలుకోలేకపోతున్న టీఆర్ఎస్‌కు రేవంత్ రెడ్డి విజయం పెద్ద షాక్ ఇచ్చినట్టయ్యింది. రేవంత్ గెలుపును కొందరు ఊహించలేదు ..

అన్ని అసెంబ్లీ స్థానాల్లో తెరాస అభ్యర్థులే ఉండటంతో ఆ పార్టీ విజయం సాధిస్తుందని అందరు భావించారు ..అయితే అభ్యర్థిత్వం ఖరారయినప్పటినించి పక్కా వ్యూహంతో వ్యవహరించిన రేవంత్ అన్ని వర్గాల మద్దతు కూడగట్టి విజయం సాధించారు .. ఒకరకంగా అసెంబ్లీలో ఓడినప్పుడే రేవంత్ లోక్ సభపై గురిపెట్టారు . మల్కాజ్ గిరిలో ముందు నుంచి పని చేసుకుంటూ ..అధిష్టానాన్ని ఒప్పించి సీటు తెచ్చుకోవడమే కాక .. తీవ్రంగా కృషి చేసి గెలుపును సొంతం చేసుకున్నారు .

To Top
error: Content is protected !!