అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
నేషనల్

భయ్యూజీ మహారాజ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలుసా!

భయ్యూజీ మహారాజ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలుసా!

అందమైన భార్య. అద్భుతమైన భవంతి. కావాల్సినంత సంపద. అన్నీ వున్నా ఆ బాబా అలా ఎందుకు చేసినట్లు? ఆయన ఓ వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త. ఆయన సేవలకు మెచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పదవిని ఇస్తామని కమలనాథులు కబురు పంపారు. అయితే, తనకు మంత్రి పదవి వద్దని తెగేసి చెప్పారు. అలా చెప్పిన కొన్ని రోజుల్లోనే ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంతకీ ఆయన ఎవరన్నదే కదా మీ సందేహం.
ఆయన ఎవరో కాదు.. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్. ఊరు ఇండోర్. మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఈయన మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆశ్రమంలోనే తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీ శబ్దంతో షాక్‌కు గురైన ఆయన శిష్యులు భయ్యూజీ గదిలోకి వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో హుటాహుటిన స్వామిజీను ఇండోర్‌ బాంబే ఆసుపత్రికి తరలించారు. భయ్యూజీని పరీక్షించిన వైద్యులు ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు. తను తీవ్రమైన ఒత్తిడికి లోనయినట్లు ఓ లేఖ రాసిపెట్టారు.
గత ఏప్రిల్ నెలలో భయ్యూజీకి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మంత్రి పదవిని ఆఫర్‌ చేసింది. అయితే, దాన్ని భయ్యూజీ తిరస్కరించారు. ప్రజలకు చేరువయ్యేందుకు పదవులు అక్కర్లేదని తెగేసి చెప్పారు కూడా. ఇంతలోనే ఈ విషాదకర నిర్ణయం తీసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు.

To Top
error: Content is protected !!