క్రీడలు

మహిళ క్రికెటర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ

bcci plans to launch womens ipl tournament
మహిళ క్రికెటర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ
భారత సీనియర్ల జట్టుతో పాటు తమకు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని భారత మహిళ జట్టు సభ్యులు ఎప్పటి నుంచో బీసీసీఐని కోరుతున్నారు. కానీ బీసీసీఐ మాత్రం వీరి అభ్యర్థనను ఏనాడు పరిగణలోకి తీసుకోలేదు. అయితే ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ హోరాహోరాగా సాగుతోంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్‌లో బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాయి. ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను మినహాయిస్తే.. మిగితా ఐదు జట్లు ప్లేఆఫ్స్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మహిళ క్రికెటర్లకు ఓ శుభవార్త చెప్పింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కి ముందు మహిళ క్రికెటర్లకు ఓ ఛాలెంజ్ టీ-20 మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. భారత మహిళ టీ-20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో ఒక టీం, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సారథ్యంలో మరో టీం ఈ మ్యాచ్ ఆడనున్నాయి.
ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లలోని పలువురు ప్రధాన మహిళ క్రికెటర్లు పాల్గొననున్నారు. 22 మేన జరిగే ఈ మ్యాచ్‌ కోసం తుది జట్లను ఇంకా నిర్ణయించాల్సి ఉంది. గతేడాది జరిగిన మహిళ ప్రపంచకప్ తర్వాత నుంచి మహిళ క్రికెట్‌ కూడా భారత్‌లో అత్యంత ప్రాధాన్యత సంతరిచుకుంది. మహిళ క్రికెట్ మరింత బలమైన వేదికను అందించేందుకు బీసీసీఐ ఈ మ్యాచ్‌ను నిర్వహించనుంది. ఈ మ్యాచ్‌ మంచి ఆదారణను సంపాదిస్తే.. త్వరలోనే మహిళ ఐపీఎల్‌ని కూడా ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
To Top
error: Content is protected !!