తెలంగాణ

కాంగ్రెస్ కి బండ్ల గణేష్ రాజీనామా …!

bandla ganesh resign to congress party
కాంగ్రెస్ కి బండ్ల గణేష్ రాజీనామా ...!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాబితాల రూపంలో అభ్యర్థుల పేర్లను విడుదల చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రాజేంద్రనగర్ స్థానాన్ని సస్సెన్ష్ పెడుతూ ఉత్కంఠను కంటిన్యూ చేస్తోంది. మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం తమకు కేటాయించాలంటూ టీటీడీపీ కోరుతోంది. గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం నుండి టీడీపీ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ బరిలోకి దిగి గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుని ఈసారి కూడా ఎన్నికల బరిలో నిలుచున్నారు …,

అయితే ఈ సీటుపై అన్ని రాజకీయనాయకుల పట్టు కోసం చేయని ప్రయత్నాలు లేవు ..టిడిపి కూడా ఎంతో ప్రతిష్ఠంకంగా భావించి పట్టుబట్టి మరి రాజేందర్ నగర్లో గణేష్ గుప్తాకి టికెట్ కన్ఫర్మ్ చేయించుకోవడంతో , అక్కడ సీటు ఆశించిన కాంగ్రెస్ సీనియర్ లిడర్ సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి ఇండిపెడెంట్ గా బరిలోకి దిగనున్నాడు .. ఇప్పుడు ఇక అందరిచూపు బండ్ల గణేష్ పై పడింది …, ఓవర్ నైట్ రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న బండ్ల గణేష్ తెలంగాణాలో మూడు స్థానాలు ఆశించాడు …

షాద్ నగర్ , జూబ్లీ హిల్స్ , రాజేందర్ నగర్ … వీటిలో ఇప్పటికే షాద్ నగర్ మరియు జూబ్లీ హిల్స్ , ఇతరులకు టికెట్టు కేటాయించడంతో , రాజేందర్ నగర్ సీటుపై ఎన్నో ఆశజలు పెట్టుకున్న బండ్ల గణేష్ కి తీవ్ర పరాభవమే దక్కింది .., హైకమాండ్ టికెట్టు నిరాకరించడంతో ఏమిపాలుపోక ఫార్మ్ హౌస్ కె పరిమితమైపోయాడట బండ్ల ..

ఇండిపెడెంట్ గాపోటీ చేయాలనీ కొందరు సూచించిన సరైన క్యాడర్ లేకపోవడంతో , తనకి అవమానించిన కాంగ్రెస్ కి రాజీనామా చేసి , పోయిన పరువును దక్కించుకోవాలని బండ్ల గణేష్ ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి .. నెల నుండి సీరియస్ పొలిటికల్ డిస్కర్షన్స్ తో వేడెక్కిన తెలుగు ఛానెల్స్ లో సరిపడా వినోదాన్ని ఇస్తూ ప్రజల నోళ్ళలో నానుతూ వస్తున్నా బండ్లకి ఇంత పరాభవం దక్కుతుండనై ఊహించివుండడు , అదే కదా కాంగ్రెస్ మార్క్ రాజకీయం, పాపం బండ్ల అంటూ కొందరు సోషల్ మీడియాలో సానుభూతి తెలియజేస్తున్నారు ..

To Top
error: Content is protected !!