నేషనల్

అభినందన్ ను రేపు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన పాక్ ప్రధాని!

దేశంలో ప్రస్తుతం చర్చంతా వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ గురించే. పాకిస్తాన్‌ ఆర్మీ అదుపులో ఉన్నఅభినందన్‌ పరిస్థితి ఏంటి?.. ఇంతకీ అభినందన్‌ను పాక్‌ వదిలిపెడుతుందా?.. ఒక వేళ వదిలిపెట్టకపోతే మన దేశం చేపట్టే చర్యలు ఏంటి? అన్నదానిపైనే దేశ ప్రజల ఆసక్తి నెలకొంది . అయితే.. జెనీవా ఒప్పందం గురించి తెలిసినవారు మాత్రం అభినందన్‌ తప్పక విడుదలవుతాడని చెబుతున్నారు. యుద్ధ ఖైదీలకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాలే ఫైనల్‌. అన్ని దేశాలూ పాటించాల్సిందే అంటున్నారు..

ఇక ఇది ఇలా ఉండగా పాక్ అదుపులోకి తీసుకున్న భారత పైలట్ అభినందన్ వ్యవహారంపై ఆ దేశం ఎట్టకేలకు స్పందించింది. పాకిస్థాన్ విదేశాంగ ప్రతినిధి డాక్టర్ ముహ్మద్ పైజల్ మాట్లాడుతూ.. అభినందన్ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.ఇక అదే సమయంలో పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ అభినందన్ ను విడుదల చేయబోతున్నట్టు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. భారత్-పాకిస్థాన్ ల మధ్య శాంతి నెలకొనాలనే ఉన్నత లక్ష్యంలో భాగంగా అభినందన్ ను రేపు విడుదల చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

పాక్ పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ ఈమేరకు ప్రకటించారు.ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య ఉద్రక్తతలను తగ్గించుకునే క్రమంలో భారత్ ప్రధాని మోదీతో మాట్లాడేందుకు నిన్న తాను యత్నించానని చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను… తాము భయపడుతున్నట్టుగా అర్థం చేసుకోవద్దని అన్నారు. మరోవైపు ఇమ్రాన్ తీసుకున్న నిర్ణయం పట్ల భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

To Top
error: Content is protected !!