ఆంధ్ర ప్రదేశ్

‘ఏపీ మంత్రి’… అధికారులకు షాక్ ఇచ్చారు…!

'ఏపీ మంత్రి'... అధికారులకు షాక్ ఇచ్చారు...!

పాలకులు కరకుగా ఉంటే.. ఇష్టారాజ్యంగా వ్యవహరించాలన్న ఆలోచనే రాదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న భయం ఉంటే.. వ్యవస్థలు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేస్తాయి. అయితే.. అలాంటిదేమీ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించటం ఏపీలో ఈ మధ్యన మరింత ఎక్కువైంది. తామేం చేసినా పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేకపోవటం.. చర్యలు తీసుకోవాలంటే అనునిత్యం భయపడే పాలకుల పుణ్యమా అని వ్యవస్థలు ఎంతగా భ్రష్టు పట్టిపోయాయో.. తాజాగా ఏపీ రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు నిర్వహించిన సమావేశం ఒకటి స్పష్టం చేసింది. అందరిని అవాక్కు అయ్యేలా చేసింది.వినియోగదారుల రక్షణ మండలి సమావేశాన్ని తాజాగా ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు వింటే షాక్ కు గురి కావటం ఖాయం. ఎందుకిలా అంటే.. చట్టాన్ని మార్చాలంటూ ఆయన కొత్త మాటలు చెబుతున్నారు. ప్రజల్ని నిత్యం దోపిడీకి గురి చేసే అంశాల్ని యుద్ధ ప్రాతిపదికన క్లోజ్ చేయాల్సింది పోయి.. వాటిని తప్పుపడుతూ.. తిట్టుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని పత్తిపాటి గుర్తిస్తే మంచిది. బ్రాండెడ్ వాటర్ బాటిళ్లను కాకుండా లోకల్ గా తయారయ్యే వాటర్ బాటిల్స్ ను షాపింగ్ మాల్స్.. మల్టీఫ్లెక్సుల యజమానులు రూ.100 చొప్పున విక్రయిస్తున్న వైనం ఆయన దృష్టికి వచ్చింది. ఇలాంటి వారి లైసెన్స్ లు రద్దు చేస్తామని చెప్పటం పోయి.. తామేమీ చేయలేకపోతున్నామని.. ఇలాంటి వాటికి చెక్ చెప్పాలంటే కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటూ పత్తిపాటి చెప్పటం షాకింగ్ గా మారింది.

To Top
error: Content is protected !!