ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల ముందర బాబుకి షాకిచ్చిన హై కోర్ట్

AP High Court Shock To Chandrababu
ఎన్నికల ముందర బాబుకి షాకిచ్చిన హై కోర్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు సహా కడప, శ్రీకాకుళం ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేవేసింది. ఈసీ అధికారాల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని వెల్లడించింది.

రెండు రోజుల క్రితం ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుబట్టింది. కడప, శ్రీకాకుళం ఎస్పీల బదిలీల నిర్ణయాన్ని అమలు చేయడానికి సిద్ధమైన ఏపీ ప్రభుత్వం… ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు బదిలీని మాత్రం నిలిపేసింది.

ఆయన ఎన్నికల విధుల్లోకి రారంటూ ఏపీ ప్రభుత్వం వాదించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక జీవోను కూడా విడుదల చేసింది. మరోవైపు ఈ అంశాన్ని హైకోర్టులోనూ ఏపీ సర్కార్ సవాల్ చేసింది. వెంకటేశ్వరరావు సీఎం భద్రతను చూస్తారనీ, ఎన్నికల నిర్వహణతో ఆయనకు సంబంధం లేదని ,అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఎస్పీ రాహుల్ దేవ్ ను బదిలీ చేయడం సరికాదని వాదించింది.

మరోవైపు ఈసీ న్యాయవాది స్పందిస్తూ.. ఈ బదిలీలు తాత్కాలికమేనని స్పష్టం చేశారు. ఈ బదిలీలు ఎలాంటి శిక్ష కాదనీ, ఓసారి పోలింగ్ పూర్తయ్యాక వీరంతా తిరిగి తమ విధుల్లో చేరవచ్చని తేల్చిచెప్పారు దీనిపై ఈసీ, ఏపీ ప్రభుత్వం వాదనలు విన్న ఏపీ హైకోర్టు… ఐపీఎస్ ల బదిలీలను నిలిపివేయాలన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది.దీనితో ఎన్నికల ముందర బాబు ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది .

To Top
error: Content is protected !!