ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ ఎమ్మెల్యే ఫైర్‌బ్రాండ్ రోజా కొత్త రాజకీయ వ్యూహం

ycp mla roja new strategy for elections
వైసీపీ ఎమ్మెల్యే ఫైర్‌బ్రాండ్ రోజా కొత్త రాజకీయ వ్యూహం

వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రోజా.. త‌న రాజ‌కీయ వ్యూహాన్ని షార్ప్‌గా మ‌లుపుతిప్పారు. రాజ‌కీయాల్లోకి చాలా ఆల‌స్యంగా వ‌చ్చినా.. ఆలోచ‌నాత్మ‌కంగా ఉండే రోజా.. మిగిలిన మ‌హిళా నేత‌ల‌ను సైతం వెన‌క్కి నెట్టి త‌ను ముందుకు వ‌చ్చేసింది. అటు మాట‌ల్లో కానీ, ఇటు రాజ‌కీయాల్లోకానీ త‌న‌కు తానే సాటి అని పించుకునేలా ఆమె చ‌క్రం తిప్పుతున్నారు. టీడీపీతో ఎంట్రీ ఇచ్చినా.. అక్క‌డ కాలం క‌లిసి రాక‌పోవ‌డంతో కాంగ్రెస్‌లో చేరాల‌నుకుని వైసీపీలో ఎదిగిన రోజా.. చిత్తూరు జిల్లా న‌గ‌రి నుంచి 2014లో సీనియ‌ర్ మోస్ట్ రాజ‌కీయ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడుపై సుమారు 900 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్ప‌టి నుంచి యాక్టివ్‌గా ఉన్న రోజా.. ఇటు పార్టీలోను, అటు అధినేత ప‌రంగానూ ఎప్ప‌టిక ప్పుడు స్పందిస్తూ.. త‌న పాలిటిక్స్‌కు ఎదురు లేకుండా చేసుకుంటున్నారు.
అయితే, రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి సిట్యుయేష‌న్ ఎదుర‌వుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. తాను ఎంత యాక్టివ్‌గా ఉన్నప్పటికీ కొన్ని విష‌యాల్లో నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉండ‌డం రోజాను క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న విష‌యం. అదేస‌య‌మంలో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు సెంటిమెంట్‌ను కూడా ఎవ్వ‌రూ త‌గ్గించ‌లేని ప‌రిస్తితి నెల‌కొంది. ఇటీవ‌ల ఆయ‌న మృతి చెందిన ఘ‌ట‌న‌తో ఈ సెంటిమెంట్ మ‌రింత పెరిగింది. పార్టీల‌కు అతీతంగా నేత‌లు ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌కు పాల్గొని శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు కూడా సొంత మ‌నిషిని కోల్పోయిన‌ట్టు ఫీల‌య్యారు. ఇలా నియోజ‌క‌వ‌ర్గం మొత్తం కూడా గాలి కుటుంబానికి బాస‌ట గా నిలిచింది.
దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ సెంటిమెంట్ మ‌రింత బ‌ల‌ప‌డే సూచ‌న‌లే క‌నిపిస్తున్నాయి. గాలి కుటుంబం నుంచి ఆయ‌న కుమారుడు భానుప్ర‌కాష్ నాయుడు పోటీకి దిగితే.. ఫుల్ మెజారిటీతో గెలుపొందే అవ‌కాశం ఉంది. ఇక‌, ఈ విష‌యంలో త‌న ఇమేజ్ కూడా ఎంత మాత్ర‌మూ ప‌నిచేసేలా క‌నిపించ‌డం లేద‌ని రోజా గ్ర‌హించారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌గ‌రి నుంచి పోటీ చేస్తే గ్యారెంటీగా గెలుస్తాన‌న్న‌ ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవడంతో.. త‌న‌కు వేరే నియోజ‌క‌వ‌ర్గం కేటాయించేలా జ‌గ‌న్‌ను కోరాల‌ని ఆమె డిసైడ్ అయిన‌ట్టు న‌గ‌రిలోని ఆమె అనుచ‌రులు చెబుతున్నారు. పార్టీలో తాను బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్నందున త‌న‌కు వేరే గ‌ట్టి నియోజ‌క‌వ‌ర్గం కేటాయించాల‌ని ఆమె కోరే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

నిజానికి పార్టీలో ఎంద‌రో మ‌హిళా నేత‌లు ఉన్న‌ప్ప‌టికీ.. ఫైర్ బ్రాండ్‌, జ‌బ‌ర్ద‌స్త్‌గా రోజా త‌న స‌త్తా చాట‌డంతో పార్టీలో ప్ర‌త్యేకంగా నిలిచారు. కాబ‌ట్టి ఆమె సేవ‌లు పార్టీకి అవ‌స‌రం. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌.. త‌ప్ప‌కుండా రోజాకు ఎక్క‌డో ఒక చోట టికెట్ కేటాయించే అవ‌కాశం ఉంద‌నేది నేత‌ల మాట‌. అయితే, ఇప్ప‌టికే ఆమెపై స‌ర్వేలో మైన‌స్ మార్కులు ప‌డ్డాయి కాబ‌ట్టి, పీకే సూచ‌న మేర‌కు ప‌క్క‌కు పెడ‌తార‌ని మ‌రికొంద‌రి మాట‌. మ‌రి రోజా రిక్వెస్ట్ విష‌యంలో జ‌గ‌న్ ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటాడో ? చూడాలి.

To Top
error: Content is protected !!