ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో అధికారాన్ని శాసించేది మేమే అంటున్న బీజేపీ!

ఏపీలో అధికారాన్ని శాసించేది మేమే అంటున్న బీజేపీ!

2019లో జరిగే ఎన్నికల్లో ఏపీలో బీజేపీదే అధికారమని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఏపీ, తెలంగాణల్లో పుంజుకునేందుకు తమ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దృష్టి సారించారని చెప్పారు. ఇరు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. బీజేపీకి, టీడీపీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని… టీడీపీతో మిత్రపక్షంగానే ఉంటూ బలోపేతమవుతామని చెప్పారు. 2019 ఎన్నికల సంద్భంగా సీట్లను యాచించే స్థితిలో బీజేపీ ఉండదని… అధికారపక్షాన్ని డిసైడ్ చేసే స్థాయిలో ఉంటుందని తెలిపారు. బీజేపీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని… గ్రామ స్థాయిలో పార్టీ కేడర్ బలంగా ఉందని చెప్పారు

To Top
error: Content is protected !!