ఆంధ్ర ప్రదేశ్

పవన్ పై కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ర్!

పవన్ పై కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈ పేరు వింటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు పూనకంతో ఊగిపోతారు. ‘అక్కడమ్మాయి… ఇక్కడ అబ్బాయి’ మొదలుకొని ‘అజ్ఞాతవాసి’ వరకూ ఆయన సినిమా ఏదైనా సరే హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేదు. ఆయనంటే అభిమానుల్లో ఓ ట్రెండ్ సెట్టర్ అంతే. ఆయన ట్రెండ్‌ను ఫాలో కాడు.. ట్రెండ్‌ను సెట్ చేస్తాడు. అలాంటి ట్రెండ్ సెట్టర్‌కే అసలు నటనే రాదంటూ పవన్ పై విరుచుకు పడ్డాడు బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌ రెడ్డి.

ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ ఇప్పుడిప్పుడే లైట్ వాయిస్ వినిపిస్తున్న పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు కిషన్ రెడ్డి. అన్న చిరంజీవిని అడ్డుపెట్టుకుని యాక్టర్‌గా మారిన పవన్ కళ్యాణ్‌కు అసలు నటనే రాదన్నారు. ఇప్పుడు మీడియా కవరేజ్ ఉంది కదా అని రాజకీయనాయకుడిగా మారేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారని.. ముందు ఆయన నటన నేర్చుకుంటే బెటర్ అని అతని హావభావాలు చూస్తే నవ్వొస్తుందన్నారు.. పవన్ కంటే తన అన్న(చిరంజీవి) కొడుకు రామ్ చరణ్ తేజ నటన చాలా బెటర్ అంటూ పవన్‌పై విమర్శలు గుప్పించారు కిషన్ రెడ్డి.

అయితే మొన్నటి వరకూ పవన్ దయ మీద ఏ పి లో బలపపడటానికి ప్రయత్నించిన బీజేపీ అతనికి నటనే రాదంటూ విమర్శలు చేయడం తగదంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఆయనకు నటన వచ్చో.. రాదో తెల్చాల్సింది ప్రేక్షకులని, ఇప్పటికే పవన్‌కి నటుడిగా ఉన్న స్టామినా ఏంటో ఆయన గత రికార్డ్స్ చూస్తే అర్థమౌతుందని పవన్ ఫ్యాన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. ఇలా విమర్శల వల్ల పవన్ ప్రభంజనం ఆపలేరు దమ్ముంటే ఏ పి కి న్యాయం చెయ్యండి అని విమర్శలు గుప్పిస్తున్నారు పవన్ ఫ్యాన్స్.

To Top
error: Content is protected !!