ఆంధ్ర ప్రదేశ్

పవన్ కల్యాణ్ కు ఇప్పటికైనా చంద్రబాబు నిజస్వరూపం అర్ధమవుతుందా

pawan kalyan about chandrababu
పవన్ కల్యాణ్ కు ఇప్పటికైనా చంద్రబాబు నిజస్వరూపం అర్ధమవుతుందా

‘శ్వేతవర్ణం’ అంటేనే బాబుకు మహా చిరాకు. తెలుపు రంగు అంటేనే ఆయనకు అసహ్యం! రాజకీయాల్లో పార్టీలతో నిమిత్తం లేకుండా.. నాయకులు అందరూ దాదాపుగా తెల్లటి బట్టలను ధరించడం అనేది ఒక రివాజుగా ఈ దేశంలో చెలామణీ అవుతుంటుంది. ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాలకు తప్ప.. నేతలు చాలా వరకు రంగు దుస్తులు వేసుకోరు. కానీ ఒక్క చంద్రబాబునాయుడు మాత్రం.. తెలుపు రంగును పూర్తిగా విసర్జించి… అచ్చంగా.. కాస్త ముదురు గోధుమరంగును మాత్రం తన బ్రాండ్ గా వాడుతుంటారు. తెలుపురంగు- శ్వేతవర్ణాన్నే అంతగా అసహ్యించుకునే చంద్రబాబు ‘‘శ్వేతపత్రం’’ మాట వినిపిస్తే మరెంతగా మండిపడతారో కదా…? అదే మండిపాటు ఇప్పుడు ఆయనతో అప్రకటిత అనుబంధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న పవన్ కల్యాణ్ కు స్వానుభవంలోకి వస్తోంది. శ్వేతపత్రం అంటే అందులో పేర్కొన్న ప్రతి వివరానికీ బాధ్యత తీసుకుంటే రాబడి ఖర్చుల గురించి ప్రభుత్వం వివరించే వాస్తవాల డాక్యుమెంట్. తాను గద్దె ఎక్కగానే.. అదివరకటి ప్రభుత్వాలు.. శాఖలను నిధులను ఏ రకంగా భ్రష్టు పట్టించేశాయో.. ప్రపంచం ముందు చాటి చెప్పి తన మీద సానుభూతి సంపాదించుకోవడానికి చంద్రబాబునానాయుడు ఈ శ్వేతపత్రం అనే అస్త్రాన్ని వాడుకున్నారు. తన పరిపాలన సమస్తం.. రియల్ టైం గవర్నెన్స్ లాంటి టెక్నికల్ హంగులతో అత్యంత పారదర్శకంగా సాగుతుందనే ఆయన.. తన పాలనలో వ్యవహారాల మీద – ఎవ్వరూ అడగకముందే తనే శ్వేతపత్రం విడుదల చేసుకుని ఉంటే ఎంత గౌరవంగా ఉండేది. తన పాలన మీద ఎవరు శ్వేతపత్రం అనే మాటెత్తినా.. ఆయన ఒక్కసారిగా ఉడుక్కుంటారు. ఆగ్రహిస్తారు. రంకెలు వేస్తారు. తానే గెలిపించానని అధికార పీఠంపై తానే కూర్చోబెట్టానని భ్రమల్లో గడిపేస్తున్న పవన్ కల్యాణ్ కు ఇప్పటికైనా చంద్రబాబు నిజస్వరూపం అర్థమవుతుందో లేదో అని ప్రజలు అనుకుంటున్నారు.

To Top
error: Content is protected !!