ఆంధ్ర ప్రదేశ్

ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు రెడీ: లోకేష్

Nara Lokesh in kurnool meeting
ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు రెడీ: లోకేష్

ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు రెడీగా ఉన్నారని ప్రకటించారు ఏపీ మంత్రి నారా లోకేష్. విశాఖ, విజయనగరం జిల్లాల్లో మంగళవారం పర్యటించిన లోకేష్.. ప్రధాన ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిరుద్ది కి అడ్డం పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ ఫిరాయింపుల అంశంపై స్పందిస్తూ.. మరికొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.
ఇప్పటికే ఏపీలో ఇరవై మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పక్షంలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లంతా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండానే కొనసాగుతున్నారు. వీరిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నంద్యాల ఉప ఎన్నిక అనంతరం మరింత మంది ఎమ్మెల్యేలు వైకాపా నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి ఊతం ఇస్తూ లోకేష్ బాబు కూడా.. ఫిరాయింపులు మరిన్ని ఉంటాయని వ్యాఖ్యానించారు.ముగ్గురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, తెలుగుదేశంలోకి చేరతామంటూ వర్తమానాలు పంపిస్తున్నారని లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే ఆ ముగ్గురు ఎవరు? అనే అంశంపై మాత్రం లోకేష్ పెదవి విప్పలేదు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!