కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
ఆంధ్ర ప్రదేశ్

మనవడి సైకిల్ పై ముచ్చటపడ్డ చంద్రబాబు..!! ఏం చేశారో తెలుసా..?

మనువడు దేవాన్ష్ అంటే చంద్రబాబుకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పని ఒత్తిడిలో ఉండడం, తాను విజయవాడలో, దేవాన్ష్ హైదరాబాద్ లో ఉండడంతో మిస్ అవుతున్నానంటూ చాలాసార్లు బాబు చెప్పారు. తాజాగా దేవాన్ష్ సైకిల్ కోసం చంద్రబాబు స్పెషల్ ఇంట్రస్ట్ చూపించారు. ఇంతకూ ఆ సైకిల్ కథేంటి అనుకుంటున్నారా.. వినండి ..
ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు పార్టీ శ్రేణులన్నీ బిజీగా ఉన్నాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళం వెళ్లిన చంద్రబాబు అక్కడ పలువురి గడపలు తొక్కి పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేశారు. అలాగే వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో ఓ అభిమాని బుల్లి సైకిల్ తీసుకొచ్చి బాబుకు చూపించారు. ఇది దేవాన్ష్ కు ఇవ్వాలని ప్రత్యేకంగా అభ్యర్థించారు.

 
అక్కడే ఉన్న ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఈ సైకిల్ దేవాన్ష్ కు సరిగ్గా సరిపోతుందని.. తీసుకోవాలని చంద్రబాబును కోరారు. పసుపు రంగులో ఉండడం, సరిగ్గా దేవాన్ష్ తొక్కడానికి అనువుగా ఉండడంతో దానిపై చంద్రబాబు ముచ్చటపడ్డారు. దాన్ని దేవాన్ష్ కోసం తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వాస్తవానికి చంద్రబాబు ఎలాంటి గిఫ్టులూ తీసుకోరు. ఎవరు ఏదిచ్చినా అది ఫోటోల వరకే..! దాన్ని అంతటితో వదిలేసి వచ్చేస్తుంటారు. కానీ దేవాన్ష్ సైకిల్ పై మాత్రం చంద్రబాబు విపరీతమైన ఆసక్తి ప్రదర్శించారు. దేవాన్ష్ కోసం సైకిల్ తీసుకుంటున్నట్టు అంగీకరించిన తర్వాత యధాతథంగా చంద్రబాబు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఆ సైకిల్ కథ కూడా అంతటితో ముగిసినట్లేననుకున్నారు.అయితే చంద్రబాబు మనసులో మాత్రం అది అలాగే ఉండిపోయింది. ప్రోగ్రామ్ ముగించుకుని హెలికాప్టర్ ఎక్కేటప్పుడు అక్కడున్న నేతల కు ఆ సైకిల్ ను విజయవాడ తీసుకురండి.” అని గుర్తుచేసుకుని మరీ చెప్పారు. దీంతో అక్కడి నేతల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బాబుగారి కోరిక మేరకు త్వరలోనే దాన్ని విజయవాడ తీసుకొచ్చేందుకు నేతలు సిద్ధమైపోయారు..

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!