ఆంధ్ర ప్రదేశ్

జూనియర్ ఎన్టీఆర్ పై రాజకీయ వర్గాలలో చర్చలు !

jr ntr nava bharat national party
జూనియర్ ఎన్టీఆర్ పై రాజకీయ వర్గాలలో చర్చలు !

జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ వర్గాలలో లోతైన చర్చలు జరుగుతున్నాయి. ‘నాన్నా ఇంకో జన్మంటూ ఉంటే మీ రుణం తీర్చుకుంటాను ఈ జన్మలో మాత్రం అభిమానులతో ఉండిపోతాను’ అని ఎమోషనల్‌ గా జూనియర్ చేసిన కామెంట్స్ వెనుక చాలా అర్ధాలు ఉన్నాయి అని అంటున్నారు.తెలుగుదేశం పార్టీ పై పట్టు సాధించాలని తన వారసులు టిడిపిని నడపాలనే కోరిక ఎప్పటి నుంచో హరికృష్ణకు ఉంది అని అంటారు. దీనికితోడు జూనియర్ ను రాజకీయాలలోకి తీసుకు రావాలి అన్న ఆలోచన హరికృష్ణకు ఉంది అన్న మాటలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అయితే తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా జూనియర్ ధైర్యం చేయలేకపోతున్నాడు అనే కామెంట్స్ కూడ ఉన్నాయి.
దీనితో జూనియర్ వాడిన తండ్రి రుణం అన్న పదం వెనుక చాలా అర్ధాలు ఉండటమే కాకుండా రాజకీయ కోణం కూడ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ నుండి ఈమాటలు వచ్చిన నేపధ్యంలో తాను రాజకీయాలకు దూరం అని చెప్పకనే చెపుతూ తన తండ్రి హరికృష్ణకు సంకేతాలు ఇవ్వడమే కాకుండా తన బాబాయి బాలకృష్ణకు కూడ సంకేతాలు ఇచ్చే విధం జూనియర్ స్పీచ్ సాగింది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ‘ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలో మీ అందరి ప్రేమ ఆప్యాయత దక్కింది. మీ అభిమానం దక్కింది. మీఅందరి ముఖంగా మా అమ్మానాన్నలకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. తల్లిదండ్రుల ఋణం ఎప్పటికీ తీర్చుకోలేను. నాన్న ఇంకో జన్మంటూ ఉంటే మీ ఋణం తీర్చుకుంటాను. ఈ జన్మలో మాత్రం అభిమానులతోనే ఉండిపోతాను. మీ అందరి రూపంలో నాకు ఇంత గొప్ప కుటుంబం దొరికింది. రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతా. మీరు నాపై పెట్టుకున్న నమ్మకమే నాకు ముఖ్యం. మంచి చిత్రాలు తీసి మీఋణం తీర్చుకుంటా.’ అని తారక్ మాటలను బట్టి ఇప్పట్లో కాకపోయినా భావిష్యుత్ లో జూనియర్ రాజకీయాలలోకి వస్తాడు అని జరుగుతున్న ప్రచారానికి సమాధానం అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ కామెంట్స్ హరికృష్ణ కు నిరాశ కలిగించే మాటలు అనుకోవాలి..

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!