పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కినిరాశే మిగిలింది...!సౌదీ అరేబియాలో మ‌హిళ‌లు చేయ‌కూడ‌ని ప‌నులేంటో తెలుసా.....?ప్ర‌ధాని గొంతు కోయ‌డానికి బీహారీలు సిద్ధంగా ఉన్నారు....ర‌బ్రీ దేవి తీవ్ర‌వ్యాఖ్య‌లుజూలీ 2 ఇది ఒక సౌత్ హీరోయిన్ రియల్ స్టోరీ..తీవ్ర అసంతృప్తిలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి..!! వైసీపీకి గుడ్‌ బై ..?చంద్రబాబు రెండు సార్లు చూసిన ఆ సినిమా ఏది ?గూగుల్ ప్లే స్టోర్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ యూసీ బ్రౌజ‌ర్....!!నయనతార పారితోషికంపై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్.ఈమె మోడ‌లింగ్ ద్వారా సంవ‌త్స‌రానికి ఎంత సంపాదించిందో తెలుసా.....??ఐన్ స్టీన్ త‌న భార్యకు ఎంత దారుణ‌మైన కండీష‌న్స్ పెట్టాడో తెలుసా...??
ఆంధ్ర ప్రదేశ్

జగన్ ని వదిలిపెట్టేదిలేదు.. బాలినేని

balineni about ys jagan mohan reddy
జగన్ ని వదిలిపెట్టేదిలేదు.. బాలినేని

ఇటీవల సోషల్‌ మీడియాలో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న దుష్రచారాలను నమ్మొద్దని, తాను వైసీపీ నుంచే పోటీ చేస్తున్నానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో మరోసారి ఇటువంటి పోస్టింగ్‌లు పెడితే అటువంటి వారిని ఉపేక్షించేది లేదని బాలినేని హెచ్చరించారు. తాను మంత్రి పదవిని కూడా వదులుకొని వైఎస్‌ జగన్‌ వెంట నడిచానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని, అందువల్ల కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
చంద్ర బాబునాయుడు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయినా ఇంత వరకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేసిన పరిస్థితి లేద న్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పథకాలు అమ లు చేసి అన్ని కుటుంబాలను ఆదుకుంటామనే భరోసాను కల్పించాలని బాలినేని సూచించారు. ఇప్పటికే సోషల్ మీడియా లో ఓ వర్గం కావాలనే తన పై లేని పోనీ అవాకులు చెవాకులు వెళుతోందని తాను జగనన్న ను వదిలి ఎక్కడికి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు బాలినేని.. మొత్తానికి బాలినేని మాటలతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు..

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!