కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
ఆంధ్ర ప్రదేశ్

కావేరి పుష్కరాల్లో తెలుగువారికి కష్టాలు .. బాబు జోక్యం చేస్కోండి ప్లీస్

pushkaras
కావేరి పుష్కరాల్లో తెలుగువారికి కస్టాలు.. బాబు జోక్యం చేస్కోండి ప్లీస్

పవిత్ర కావేరీ నది పుష్కరాలు రెండు రోజుల క్రితం ప్రారంభం కాగా, పుణ్యస్నానాలు ఆచరించేందుకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని నది వద్దకు వెళుతున్న వేలాది మంది తెలుగువారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సుదూరం నుంచి వచ్చే తమకు కనీస వసతులు కల్పించడంలో తమిళ ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. తమిళనాడుకు వెళుతున్న యాత్రికుల్లో 90 శాతం తెలుగువారు కాగా, పది శాతం వరకూ ఒడిశా వాసులు వస్తున్నారు. పుష్కర స్నానం చేసేందుకు నటుడు, ఎంపీ మురళీ మోహన్ చిదంబరంకు వెళ్లగా, అక్కడికి వచ్చిన తెలుగు యాత్రికులు ఆయన్ను కలిసి తన బాధలు వెళ్లబోసుకున్నారు. మీడియాతో మాట్లాడిన మురళీ మోహన్, ప్రజలు తాము పడుతున్న కష్టాలు చెబితే తనకు బాధ కలిగిందని అన్నారు. కృష్ణా, గోదావరి పుష్కరాల సమయంలో ఏర్పాట్లు అద్భుతంగా చేశారని, ఇక్కడ మాత్రం అటువంటివి కనిపించడం లేదని యాత్రికులు ఫిర్యాదు చేశారని చెప్పారు. యాత్రికులకు కనీస సౌకర్యాలు కల్పించేలా తమిళనాడు ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబుతో చెప్పించాలని తనను కోరారని అన్నారు. తాను చంద్రబాబును కలిసి ఈ విషయమై మాట్లాడతానని చెప్పారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!