ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు మూడేళ్ల జైలు

3 years jail to mla chintamaneni prabhakar
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు మూడేళ్ల జైలు

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు భీమడోలు మెజిస్ట్రేట్ కోర్టు షాక్‌ ఇచ్చింది. మూడు వేర్వేరు కేసుల్లో ఆయనకు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే..

2011లో దెందులూరులో రచ్చబండ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్‌ రాష్ట్ర మంత్రిగా ఉన్న వట్టి వసంతకుమార్‌ మధ్య వివాదం తలెత్తింది. ఈ ఘటనలో చింతమనేని ప్రభాకర్‌ తనపై దాడి చేశారంటూ దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో వట్టి వసంత కుమార్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చింతమనేనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఏడేళ్ల పాటు విచారణ సాగించిన భీమడోలు న్యాయస్థానం మంత్రిపై చింతమనేని ప్రభాకర్‌ దాడికి పాల్పడటం వాస్తమేనని నిర్ధరించింది. దీంతో జైలు శిక్ష, జరిమానా ఖరారు చేసింది.తీర్పు వెలువడే సమయంలో తన అనుచరులతో చింతమనేని కోర్టుకు హాజరయ్యారు. తీర్పు వెలువడిన వెంటనే చింతమనేని బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా, కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

To Top
error: Content is protected !!