సినిమా

ప్రదీప్ జ్ఞానేశ్వరిల పెళ్లిపై సుమ షాకింగ్ కామెంట్స్!

suma_about_kerala_floods_yoyo_daily
ప్రదీప్ జ్ఞానేశ్వరిల పెళ్లిపై సుమ షాకింగ్ కామెంట్స్!

తెలుగులో ఈ ప్రముఖ ఛానెల్ యాజ‌మాన్యం ఓ ప్రోగ్రామ్ చేసిందంటే క‌చ్చితంగా అది హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం కూడా ఉంటుంది. కానీ చాలా ఏళ్ల త‌ర్వాత ఏ ఛానెల్లో వ‌చ్చిన ఓ కార్య‌క్ర‌మం అట్ట‌ర్ ఫ్లాప్ కాదు.. ఏకంగా డిజాస్ట‌ర్ అయింది. ఎప్పుడెప్పుడు ఆ ప్రోగ్రామ్ ఆపేస్తారా అనే ఒత్తిళ్లు కూడా వ‌చ్చాయి. ఈ కార్య‌క్ర‌మం మూలంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ ఒక్క మాట కూడా ప‌డ‌ని సుమ ప్రదీప్ వంటి స్టార్ యాంక‌ర్లు అడ్డంగా బుక్ అయిపోయారు. డ్రంకెన్ డ్రైవ్’ కేసులో అరెస్టైన తర్వాత ప్రదీప్ క్రేజ్ బాగా ప‌డిపోయింది.

ఆ తర్వాత కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయి మ‌ళ్లీ ‘పెళ్లిచూపులు’ అంటూ ఓ కొత్త కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ప్రదీప్.., షో గడుస్తున్న కొద్దీ విమర్శలు పెరుగుతూపోతుండటంతో , జ్ఞానేశ్వరి అనే అమ్మాయిని విజేతగా ప్రకటించి పెళ్ళిచూపుల్నీ అర్దాంతరంగా ఆపేసారు .., ఇక ప్రదీప్ కి పిచ్చి అభిమాని ఐన జ్ఞానేశ్వరి , తానూ ప్రదీప్ కి జీవిత భాగస్వామి అవ్వబోతున్నా అంటూ ఊహల్లో తేలిపోయింది ..ఇక అక్కడే జ్ఞేనేశ్వరికి పంచ్ పడింది … మూడుముళ్లు వేస్తాడు అనుకున్న ప్రదీప్ , షో ముగిశాక కనీసం తన మొహం కూడా చూపెట్టడం లేదని , పెళ్లి టాపిక్ వెట్టితే అవన్నీ కుదరవని ప్రదీప్ చెప్పాడని బోరుమంటుంది జ్ఞానేశ్వరి..,

ఇక ఈ విషయంపై పెళ్లిచూపులు మరో యాంకర్ సుమ స్పందించిందని నెట్లో ఒకవార్త చక్కర్లు కొడుతోంది .. పెళ్లి చూపులు ముగిసాక కూడా మాపై రూమర్స్ ని ఆపడం లేదు .. పెళ్లిచూపులు ఒక రియాలిటీ షో , పెళ్లిచేసుకోవాలి అనుకునే వారికి ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలన్న సంకల్పంతో మేము చేసాము .. ఇక ఈ స్వయంవరంలో ప్రదీప్ కి కూడా తగిన జోడి దొరికింది ..ఇక వారు పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది వారిద్దరూ ఇష్టం .., ఒకరి అభిప్రాయాలు ఒకరికి కలిస్తే ఇక అంతకంటే కావాల్సింది ఏముంది అని సుమ స్పందన ఇప్పుడు సంచలనంగా మారింది .. సాయంవరం అయిపోగానే విజేత మేడలో తాళి కడతారు అని భావించి వచ్చిన జ్ఞానేశ్వరి పెళ్లి ప్రదీప్ తో జరిగేలా కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు..

To Top
error: Content is protected !!