నేషనల్

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!

amazon great indian sale offers from 20
అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ ఈవెం ట్‌ మళ్లీ వచ్చింది. ఈ నెల 20 నుంచి 23 వరకు ఈ సేల్‌ నిర్వహిస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ నాలుగు రోజులపాటు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, హెడ్‌ఫోన్లు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు , ఆఫర్లు ఇస్తామని తెలిపింది.

HDFC కార్డులతో కొంటే 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ ఉంటుంది. ప్రైమ్‌ మెంబర్లకు ఈ నెల 19 నుంచే సేల్‌ మొదలవుతుంది. దాదాపు 10 కోట్ల ప్రొడక్ట్స్‌పై నో కాస్ట్‌ ఈఎంఐ అందిస్తున్నారు. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌తో పాటు మరికొన్ని క్రెడిట్‌కార్డులతో కొంటే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

వన్‌ప్లస్‌ 6టీ, రెడ్‌మీ వై2, హువావే నోవా 3ఐ, హానర్‌ 8ఎక్స్ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ఇస్తామని కంపెనీ తెలిపింది. ఆపిల్‌, రియల్‌మీ, షావోమీ, ఎల్జీ, ఫిలిప్స్‌ వంటి కంపెనీల వస్తువులపై 60 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తామని, టీవీలపై, గృహోపకరణాలపైనా 50 శాతం తగ్గిం పు ఉంటుందని అమెజాన్‌ వివరించింది.

To Top
error: Content is protected !!