సినిమా

శ్రీ రెడ్డి మరణ వాంగ్మూలం! షాక్ లో టాలీవుడ్!!

sri reddy comments
శ్రీ రెడ్డి మరణ వాంగ్మూలం! షాక్ లో టాలీవుడ్!!

తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పేరిట అమ్మాయిలను వేధిస్తున్నారని గత కొన్ని రోజులు శ్రీరెడ్డి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి వ్యక్తి గత ఆరోపణలు చేయడంతో మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు ఆమెను హెచ్చరించారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ కూడా కూడా ఫిలిం చాంబర్ లో నిరసన తెలిపారు. వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించేదిలేదని పవన్ హెచ్చరించారు.

అయితే మెగా ఫ్యామిలీ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని శ్రీరెడ్డి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో నాగబాబు దగ్గర నుంచి కాల్స్ వస్తుయన్నారు. నాకు ఏమైనా.. జరిగితే దానికి పూర్తి బాధ్యత మెగా ఫ్యామిలీదేనని, ఇది స్వయంగా నా చేతులతో రాస్తున్న నా వాంగ్మూలం అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

To Top
error: Content is protected !!