సినిమా

త్వరలో సౌందర్య బయోపిక్ అనూహ్యమైన రీతిలో ఆమె మరణం పై నిజాలు

త్వరలో సౌందర్య బయోపిక్ అనూహ్యమైన రీతిలో ఆమె మరణం పై నిజాలు

చిన్న సినిమాతో తెలుగు తెరపై కనిపించి .. ఆ తరువాత రాకెట్ స్పీడ్ తో అగ్రస్థాయికి దూసుకెళ్లిన కథానాయిక సౌందర్య. చాలా తక్కువ కాలంలోనే ఆమె ఎక్కువ సినిమాలు చేసేసింది. తెలుగు .. తమిళ భాషల్లో ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువ సక్సెస్ లు ఉండటం కూడా విశేషం. నటన పరంగానే అవకాశాలు దక్కించుకున్న సౌందర్య .. నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతూ ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయింది.

అలాంటి ఆమె జీవితచరిత్రను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. ఈ సినిమాకి నిర్మాతగా రాజ్ కందుకూరి వ్యవహరించనున్నాడని అంటున్నారు. ‘మహానటి’ బయోపిక్ ఘన విజయాన్ని సాధించడంతో ఇక్కడ బయోపిక్ ల జోరు పెరిగినట్టుగా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఉదయ్ కిరణ్ బయోపిక్ .. సౌందర్య బయోపిక్ లకి సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరివీ ఆసక్తిని రేకెత్తించే బయోపిక్ లే కావడంతో .. ఫిల్మ్ నగర్లో వీటిని గురించే మాట్లాడుకుంటున్నారు.

To Top
error: Content is protected !!