సినిమా

సాయిపల్లవి షాకింగ్ డెసిషన్ ?

Actress Sai Pallavi Shocking Comments About Her Marriage
సాయిపల్లవి షాకింగ్ డెసిషన్ ?

తెలుగు సినిమాల్లో ముద్ద మందారం సాయిపల్లవి. ఆమెలో ఆకట్టుకునే నటన ఉంటుంది. మన పక్కింటి అమ్మాయిలా కనిపించి మురిపిస్తుంది. తన అందం, అభినయంతో ఫిదా చేసేస్తుంది. ప్రత్యేకించి ఈ ముద్దు గుమ్మ గురించి చెప్పాలంటే డ్యాన్సులు విరగదీస్తుంది. ఒళ్ళంతా మల్లె తీగలా చేసి నాట్యం చేయమంటే చాలు సాయి పల్లవి సరేనంటుంది.

శభాష్ అనిపించేలా చేస్తుంది.ఈ కన్నడ కస్తూరిది పూర్తిగా మధ్యతరగతి మనస్తత్వం. ఆమె పుట్టి పెరిగిన వాతావరణం అసలు మరచిపోదు. నిబద్ధత. వ్రుత్తి పట్ల అంకితభావం ఆమెలో మెండుగా ఉంటాయాని కూడా చెబుతారు. ఈ మధ్యన విడుదల అయిన పడి పడి లేచే వయసు మూవీ ఫ్లాప్ కావడంతో తనకు వచ్చే రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా నిర్మాతల కధానాయిక అనిపించుకుంది ఈ ముద్దు గుమ్మ.

ఇక సాయిపల్లవి చదువులోనూ మేటి అన్నది తెలిసిందే.మెడిసిన్ చదువుతూ మూవీస్ లో ఆఫర్లు రావడంతో వచ్చేసిన ఈ చిన్నది తాను ఎప్పటికైనా డాక్టర్ అవుతాను అంటోంది. అలా పేదలకు వైద్య సేవలు అందించాలన్నది తన కర్తవ్యమని కూడా చెప్పుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాయి పల్లవి రీసెంట్ గా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను పెళ్ళి చేసుకోనంటూ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చింది.

అదేమంటే తన తల్లితండ్రులను చూసుకుంటానని, వారి జీవితమంతా హ్యాపీగా వుండేలా బాధ్యత తీసుకుంటానని చెప్పుకొచ్చింది.నిజంగా సాయి పల్లవి నిర్ణయం అందరూ మెచ్చేదే. ఈ రోజుల్లో కన్న వారిని అసలు పట్టించుకోని లోకంలో సాయి పల్లవి లాంటి సెలిబ్రిటీలు ఇలా తన వారి కోసం ఏకంగా జీవితాన్ని త్యాగం చేయడం అంటే మామూలు విషయం కాదు.

నిజంగా అభినందించాల్సిన విషయమే. సాయి పల్లవి డెసిషన్ మీద సోషల్ మీడియాలో వెల్లువలా ప్రశంసలు వస్తున్నాయి. నిజంగా ఆమె మాత్రమే అసలైన కూతురు అంటూ ప్రశంసల జల్లు కురుస్తోంది.

To Top
error: Content is protected !!