నేషనల్

మోదీ పై కుష్బూ సంచలన కామెంట్స్

Actress Kushboo commonts on narendra modi protest
మోదీ పై కుష్బూ సంచలన కామెంట్స్

దివంగత ముఖ్యమంత్రి కామరాజర్‌ ఒక్కొక్క రూపాయిని విద్య కోసం ఖర్చు చేస్తే ప్రధాని నరేంద్రమోదీ నాలుగేళ్లలో ప్రకటనల కోసం రూ.4,343 కోట్లు ఖర్చుపెట్టారని తమిళనాడు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, నటి ఖుష్బూ విమర్శించారు. దీనిని బట్టే తెలుస్తుంది టీవీలతో పాటు పత్రికలలో వచ్చే ప్రకటనలలో కనిపించాలని మోదీకి ఎంత మోజు ఉందోనని ఆమె ఎద్దేవా చేశారు. ముంబైకు చెందిన సంఘ సేవకుడు అనిల్‌ గల్గాలీ ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని రాబట్టారు. అందులో 2014 మే నుంచి వివిధ మీడియాల్లో ప్రకటనలు, ప్రచారం కోసం మోదీ ప్రభుత్వం రూ.4,343 కోట్లు వెచ్చించినట్టు వెల్లడైంది. నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రకటనల కోసం రూ.4,343 కోట్లు ఖర్చుపెట్టినట్టు సమాచారం. పత్రికలు, టీవీలతో పాటు ఇతర మాధ్యమాలలో ప్రకటనలకు మోదీ సర్కారు చేసిన ఖర్చుగా ఈ మొత్తాన్ని చూపారు. దీనిపై స్పందించిన ఖుష్బూ దివంగత ముఖ్యమంత్రి కామరాజర్‌ ప్రజలు పన్ను రూపంలో చెల్లించిన ధనాన్ని ఆవగింజంతైనా వృథా చేయలేదని, విద్య కోసం ఒక్కొక్క రూపాయిని వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. అయితే, నరేంద్రమోదీ అలాకాకుండా కేవలం ప్రకటనల కోసం రూ.4,343 కోట్లు ఖర్చుపెట్టి ప్రజలపై రుణభారాన్ని మోపారని, ఇది ఖండించదగ్గదని ఖుష్పూ తెలిపారు.

To Top
error: Content is protected !!