నేషనల్

9 లక్షలు ఆదాయం దాటితేనే టాక్స్ , ఎలాగో తెలుసుకోండి?

9 lakhs above profit income only pay tax
9 లక్షలు ఆదాయం దాటితేనే టాక్స్ , ఎలాగో తెలుసుకోండి?

2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను, మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంట్ ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఆదాయపు పన్ను పరిమితి రూ. 2.50 లక్షలు కాగా, ఇకపై రూ. 5 లక్షల వరకూ పన్ను చెల్లింపులపై రిబేట్ ఇవ్వనున్నామని పీయుష్ గోయల్ ప్రకటించారు.

ఈ నిర్ణయంతో ఎగువ మధ్య తరగతికీ ఉపశమనం కలుగుతుండగా, మినహాయింపులను సరిగ్గా వినియోగించుకుంటే, ఆదాయం రూ. 9 లక్షలు దాటినా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. చేయాల్సిందల్లా, సెక్షన్ 80-సీ కింద పన్ను రాయితీలు లభించే పెట్టుబడి మార్గాలను చూసుకోవడమే. అదెలాగంటే…ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం రూ. 9.50 లక్షలు అనుకుందాం.

ఇక ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలు, సెక్షన్ 80-సీ మినహాయింపులు రూ. 1.50 లక్షలు, ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ రూ. 2 లక్షలు (పన్ను పరిధిలోకి రానిది), ఎన్పీఎస్ పెట్టుబడి రూ. 50 వేలు, ఆరోగ్య బీమా ప్రీమియం రూ. 25 వేలుగా భావించి, వాటిని తీసివేస్తే, నికరంగా పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ. 4.50 లక్షలు ఉంటుంది. దీనిపై రూ. 10 వేలు చెల్లించాల్సివుంటుంది. సెక్షన్ 87-ఏ, కింద గరిష్ఠ రిబేటు రూ. 12,500 ఉంది కాబట్టి, కేంద్రానికి చెల్లించాల్సిన పన్ను ఏమీ ఉండదు.

To Top
error: Content is protected !!