భక్తిరసం

ఈ రోజు రాశి ఫలాలు 29 ఏప్రిల్ 2019!

29 april 2019 daily horoscopes in telugu
ఈ రోజు రాశి ఫలాలు 29 ఏప్రిల్ 2019!

మేషం

రాజకీయ, సినీరంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది. వేడుకలు, శుభకార్యాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఫొటోగ్రఫీ, రచనా రంగాల వారికి ప్రోత్సాహకరం.

వృషభం

స్నేహాను బంధాలు బలపడతాయి. సహకార సంఘాలు, బ్యాంకులతో పనులు పూర్తవుతాయి. బృంద కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. పొదుపు పథకాలు, పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. శుభకార్యాలు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి.

మిథునం

వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. సినీ, రాజకీయ, ప్రభుత్వ రంగాల వారు గౌరవ పదవులు అందుకుంటారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు.

కర్కాటకం

ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. శుభకార్యాలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఆర్థికపరమైన వ్యూహాలు, ప్రణాళికలు అమలు చేస్తారు. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

సింహం

రుణాలు, పెట్టుబడుల విషయంలో పెద్దల సహకారం లభిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణాలు మంజూరవుతాయి. ఇంక్రిమెంట్లు లభిస్తాయి. సంస్మరణల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది.

కన్య

ప్రియతముల నుంచి శుభసందేశాలు అందుకుంటారు. రక్షణ, న్యాయరంగాల వారికి శుభప్రదం. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. స్పెక్యులేషన్లు, కొత్త పరిచయాలు లాభిస్తాయి.

తుల

విందు వినోదాలతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగుల నియామకాలకు అనుకూలం. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యవసాయం, వ్యాపార రంగాలవారికి నిధులు సర్దుబాటవుతాయి. సహోద్యోగుల అంతరంగిక విషయాలు చర్చకు వస్తాయి.

వృశ్చికం

పెట్టుబడులు లాభిస్తాయి. వివాహాది, శుభకార్యాల్లో పాల్గొంటారు. సంకల్పం నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ప్రేమానుబంధాలు బలపడతాయి. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభరిణామాలు సంభవం.

ధనుస్సు

సీట్లు, స్థలం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. సన్నిహితులతో కుటుంబ విషయాలు చర్చకు వస్తాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల్లోని వారు లక్ష్యాలు సాధిస్తారు.

మకరం

సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. కీలక సందేశం అందుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులకు అడ్మిషన్లు లభిస్తాయి. ఫలితాలు ఉల్లాసం కలిగిస్తాయి.

కుంభం

ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. ఇల్లు, స్థలసేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బు సకాలంలో చేతికి అందుతుంది.

మీనం

కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు, వాహనాల కొనుగోలుకు అనుకూల సమయం. కీలకమైన మెయిల్స్‌, పత్రాలు అందుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యా సంస్థల్లో ప్రవేశంపై నిర్ణయానికి వస్తారు.

To Top
error: Content is protected !!