భక్తిరసం

ఈ రోజు రాశి ఫలాలు 28 మార్చి 2019!

4 april 2019 daily horoscopes in telugu
ఈ రోజు రాశి ఫలాలు 28 మార్చి 2019!

మేషం

కొత్త ప్రణాళికలు అమలుచేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి. ఉన్నత పదవులకోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.

వృషభం

బోధన, వాణిజ్యం, అడ్వర్టైజ్‌మెంట్లు, కళలు, ఫొటోగ్రఫీ రంగాలవారు ఆచితూచి వ్యవహరించాలి. సమావేశాలు, చర్చల్లో అసౌకర్యం తప్పకపోవచ్చు. ఉన్నత విద్య, దూరప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం

బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులకు అటంకాలు ఎదురవుతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

కర్కాటకం

ఆర్థిక విషయాల్లో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. స్పెక్యులేషన్లు, పెట్టుబడుల్లో నిదానం అవసరం.

సింహం

ఇంటర్వ్యూలలో ఆశించిన ఫలితం రాకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ప్రణాళిక లోపించడం వల్ల లక్ష్యాలు సాధించడం కష్టం. వృత్తిపరమైన సమావేశాలు, చర్చల్లో అసౌకర్యం తప్పకపోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.

కన్య

చిన్నారులు, ప్రియతముల విషయాలు ఆందోళన కలిగిస్తాయు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. షాపింగ్‌, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. బహుమతులు అందుకుంటారు.

తుల

మనశ్శాంతి లోపిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాలవారు ఆచితూచి వ్యవహరించాలి. వేడుకల్లో అపశృతులు దొర్లే అవకావం ఉంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఫర్నిచర్‌ సమకూర్చుకుంటారు.

వృశ్చికం

మార్కెటింగ్‌, బోధన, రవాణా, ఏజెన్సీలు, స్టేషనరీ రంగాలవారు లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి. చర్చలు, సమావేశాల్లో నిదానం అవసరం. ఆరోగ్యంపట్ల శ్రద్ధచూపాలి. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.

ధనుస్సు

సృజనాత్మక రంగాలవారికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహంచాలి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహకరంగా ఉంటుంది. ప్రియతములు, చిన్నారుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మకరం

బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. మీ మనసు మార్పు కోరుకుంటుంది. వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు.

కుంభం

రవాణా, బోధన రంగాలవారు ఆచితూచి ముందుడుగు వేయాలి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. చర్చలు, ప్రయాణాల్లో నిదానం అవసరం. రాజకీయ, సినీరంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు.

మీనం

ఖర్చులు అంచనాలు మించుతాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.

To Top
error: Content is protected !!