భక్తిరసం

ఈ రోజు రాశి ఫలాలు 27 మే 2019!

27 may 2019 daily horoscopes in telugu
ఈ రోజు రాశి ఫలాలు 27 మే 2019!

మేషం

రవాణా, బోధన రంగాలవారు ఆచితూచి ముందుడుగు వేయాలి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. చర్చలు, ప్రయాణాల్లో నిదానం అవసరం. రాజకీయ, సినీ రంగాలవారు కీలక సమాచారం అందుకుంటారు.

వృషభం

ఖర్చులు అంచనాలు మించుతాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహ రించాలి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.

మిథునం

కొత్త ప్రణాళికలు అమలు చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి. ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.

కర్కాటకం

బోధన, వాణిజ్యం, అడ్వర్టైజ్‌మెంట్లు, కళలు, ఫొటోగ్రఫీ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. సమావేశాలు, చర్చల్లో అసౌకర్యం తప్పకపోవచ్చు. ఉన్నత విద్య, దూరప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం

బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులకు అటంకాలు ఎదురవుతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

కన్య

ఆర్థిక విషయాల్లో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. స్పెక్యులేషన్లు, పెట్టుబడుల్లో నిదానం అవసరం.

తుల

ఇంటర్వ్యూలలో ఆశించిన ఫలితం రాకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ప్రణాళిక లోపించడం వల్ల లక్ష్యాలు సాధించడం కష్టం. వృత్తిపరమైన సమావేశాలు, చర్చల్లో అసౌకర్యం తప్పకపోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.

వృశ్చికం

చిన్నారులు, ప్రియతముల విషయాలు ఆందోళన కలిగిస్తాయు. ఆరోగ్యంపట్ల శ్రద్ధచూపాలి. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. షాపింగ్‌, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. బహుమతులు అందుకుంటారు.

ధనుస్సు

మనశ్శాంతి లోపిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. వేడుకల్లో అపశృతులు దొర్లే అవకావం ఉంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఫర్నిచర్‌ సమకూర్చుకుంటారు.

మకరం

మార్కెటింగ్‌, బోధన, రవాణా, ఏజెన్సీలు, స్టేషనరి రంగాలవారు లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి. చర్చలు, సమావేశాల్లో నిదానం అవసరం. ఆరోగ్యంపట్ల శ్రద్ధ చూపాలి. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం

సృజనాత్మక రంగాల వారికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహంచాలి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహకరంగా ఉంటుంది. ప్రియతములు, చిన్నారుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనం

బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. మీ మనసు మార్పు కోరుకుంటుంది. వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు.

To Top
error: Content is protected !!