భక్తిరసం

ఈ రోజు రాశి ఫలాలు 26 మే 2019!

26 may 2019 daily horoscopes in telugu
ఈ రోజు రాశి ఫలాలు 26 మే 2019!

మేషం

రాజకీయ, సినీరంగాల వారికి అనుకూలం. దూరంలో ఉన్న సన్నిహితులతో చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. విదేశాల్లో చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సందేశాలు, మెయిల్స్‌ అందుకుంటారు.

వృషభం

డబ్బుకు సంబంధించి తలపెట్టిన పనులు పూర్తవుతాయు. ఆర్థిక విషయంలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆశించిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. స్నేహానుబంధాలు బలపడతాయి.

మిథునం

కొత్త ప్రాజెక్టులు, పనుల ప్రారంభానికి అనుకూలం. పెద్దలు, పైఅధికారుల ప్రశంసలు అందుకుంటారు. పట్టుదలతో కృషి చేసి లక్ష్యాలు సాధిస్తారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, గౌరవ పదవులు అందుకుంటారు.

కర్కాటకం

సమావేశాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. కమ్యూనికేషన్‌ రంగాల వారికి, విద్యార్థులకు శుభప్రదం. ఆధ్యాత్మిక, సేవా రంగాల వారికి ప్రోత్సాహకరం. చర్చలు ఫలిస్తాయి. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు.

సింహం

పన్నులు, మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం. పూర్వమిత్రులను కలుసుకుంటారు. రుణప్రయత్నాలు కొలిక్కివస్తాయి. సన్నిహితుల ఆరోగ్యం మెరుగవుతుంది.

కన్య

శ్రీవారు, శ్రీమతి సహకారంతో వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు. పైఅధికారులు సానుకూలంగా స్పందిస్తారు. కొత్తపరిచయాలు లాభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల

ఆస్పత్రులు, హోటల్‌, సేవారంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తిపరమైన ప్రయాణాలు లాభిస్తాయి. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. సహోద్యోగులతో విందులు, సమావేశాలకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం (అక్టోబర్‌ 24- నవంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ప్రేమాను బంధాలు బలపడతాయి. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం మెరుగవుతుంది. చిట్‌ఫండ్స్‌, డిపాజిట్లపై మంచి ప్రతిఫలం అందుకుంటారు.

ధనుస్సు

ప్రియతముల వైఖరిలో మార్పు గమనిస్తారు. బదిలీలు, మార్పులకు అనుకూలం. బంధుమిత్రులతో ఇల్లు సందడిగా ఉంటుంది. వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

మకరం

ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వృత్తిపరమైన చర్చలు, సమావేశాలకు అనుకూలం. బంధుమిత్రులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం.

కుంభం

అదనపు ఆదాయం లభిస్తుంది. పెట్టుబడులు, పొదుపు పథకాలపై చక్కటి ప్రతిఫలాలు అందుకుంటారు. బ్యాంకులు, చిట్‌ఫండ్స్‌, ఆడిటర్లకు ప్రోత్సాహకరం. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. చిన్నారుల విషయంలో శుభపరిణామాలు సంభవం.

మీనం

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బదిలీలు, స్థలం మార్పు కోసం ప్రయత్నిస్తారు. ఆలోచనలు సమీక్షించుకుంటారు. రియల్‌ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరం. నిత్యావసరాలు, ఫర్నిచర్‌ వ్యాపారులకు ఆర్థికంగా లాభిస్తుంది.

To Top
error: Content is protected !!