భక్తిరసం

ఈ రోజు రాశి ఫలాలు 25 మే 2019!

25 may 2019 daily horoscopes in telugu
ఈ రోజు రాశి ఫలాలు 25 మే 2019!

మేషం

బంధుమిత్రులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

వృషభం

పెద్దల చొరవతో ఆర్థిక విషయాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ, మన్ననలు అందుకుంటారు. సంకల్పసిద్ధికి అనుకూలమైన రోజు.

మిథునం

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూల సమయం. సంకల్పం సిద్ధిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కళారంగాల వారు కొత్త పనులు ప్రారంభిస్తారు. లక్ష్యాలు సిద్ధించడంతో మనసు ఉల్లాసంగా ఉంటుంది.

కర్కాటకం

గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. వారసత్వ విషయాలు కొలిక్కివస్తాయి. బీమా, గ్రాట్యుటీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యవహారాలకు అనుకూలం. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

సింహం

శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రదర్శనలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు.

కన్య

ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. గౌరవ పదవులు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. వైద్యం, హోటల్‌, పరిశ్రమల రంగాల వారు ప్రముఖుల సహకారంతో లక్ష్యసాధనకు ప్రయత్నిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది.

తుల

చిన్నారులు, ప్రియతముల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రేమలు ఫలిస్తాయి. ప్రియతములతో చర్చలు, ప్రయాణాలకు అనుకూల సమమం. వృత్తి విద్యా కోర్సులు చదివేవారికి ప్రోత్సాహకరం. మనసు ఉల్లాసంగా ఉంటుంది.

వృశ్చికం

గృహరుణాల కోసం చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. బకాయిలు వసూలవుతాయి. కుటుంబ పెద్దలను స్మరించుకుంటారు. ఫర్నిచర్‌, అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు.

ధనుస్సు

కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు, చర్చలకు అనుకూలం. సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రియతములతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. రవాణా, బోధన రంగాల వారు నైపుణ్యంతో లక్ష్యాలు సాధిస్తారు.

మకరం

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకింగ్‌, హోటల్‌, ఆస్పత్రి రంగాలవారు అదనపు ఆదాయం అందుకుంటారు. సన్నిహితులు సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. విందు వినోదాల కోసం ఖర్చు చేస్తారు.

కుంభం

చిన్నారులు, ప్రియతముల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. మనసు కొత్తదనం కోరుకుంటుంది. ప్రేమలు ఫలిస్తాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. సృజనాత్మకంగా వ్యవహరించి చేపట్టిన పనులు పూర్తిచేస్తారు.

మీనం

గతంలో చేసిన కృషికి ఫలితం అందుకుంటారు. దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరుతారు. సినీ, రాజకీయ రంగాల వారికి శుభప్రదం. స్థిరాస్తి, వారసత్వ విషయాలు కొలిక్కివస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు.

To Top
error: Content is protected !!