భక్తిరసం

ఈ రోజు రాశి ఫలాలు 24 మే 2019!

24 may 2019 daily horoscopes in telugu
ఈ రోజు రాశి ఫలాలు 24 మే 2019!

మేషం

ఏజెన్సీలు, బోధన, విద్యారంగాల వారికి ఆర్థికంగా అనుకూలం. చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. సోదరీసోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.

వృషభం

వృత్తి, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల వైఖరి ఉత్సాహం కలిగిస్తుంది. ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పై అధికారుల సహకారం అందుకుంటారు.

మిథునం

రక్షణ, న్యాయ, బోధన, రవాణా, విదేశీ వ్యాపార రంగాల వారికి అనుకూలం. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దూరప్రయాణాలు, ఉన్నత విద్యా వ్యవహారాలపై ఒక నిర్ణయానికి వస్తారు. కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటారు.

కర్కాటకం

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో గత అనుభవంతో విజయం సాధిస్తారు. వారసత్వ విషయాలు కొలిక్కి వస్తాయి. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు.

సింహం

వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో శ్రీవారు, శ్రీమతి సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వివాహ నిర్ణయాలకు అనుకూలం. సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు.

కన్య

ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందులు, సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. లక్ష్యసాధనలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది.

తుల

ప్రేమానుబంధాలు బలపడతాయి. సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అంచనాలు ఫలిస్తాయు. ప్రియతముల నుంచి ఆహ్లాదకరమైన సమాచారం అందుకుంటారు. చిన్నారులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి.

వృశ్చికం

గృహనిర్మాణం, స్థలసేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఫర్నిచర్‌ కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలను సమీక్షించుకుంటారు. కుటుంబ విషయాలు ఉల్లాసం కలిగిస్తాయి. రియల్‌ఎస్టేట్‌ నిర్మాణ రంగాల్లోని వారికి శుభప్రదం.

ధనుస్సు

విద్యా సంస్థలతో పనులు పూర్తవుతాయి. సోదరీసోదరుల విషయంలో శుభపరిణామాలు సంభవం. ప్రియతములతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. సన్నిహితుల నుంచి మెయిల్స్‌, సందేశాలు ఆవేదన కలిగిస్తాయి.

మకరం

యోగ, ధ్యానాలు, డైటింగ్‌ అంశాలపై దృష్టి సారిస్తారు. కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. మెడికల్‌ క్లెయిమ్స్‌ మంజూరవుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వైద్యం, హోటల్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం.

కుంభం

మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. విద్యాసంస్థలతో పనులు పూర్తవుతాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. వివాహ నిర్ణయాలు, సంతానప్రాప్తి విషయంలో అనుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

మీనం

విదేశాల్లో ఉన్న బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలను సమీక్షించుకుంటారు. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. సంకల్పసిద్ధికి అనుకూల సమయం.

To Top
error: Content is protected !!