భక్తిరసం

ఈ రోజు రాశి ఫలాలు 23 మే 2019!

23 may 2019 daily horoscopes in telugu
ఈ రోజు రాశి ఫలాలు 23 మే 2019!

మేషం

కమ్యూనికేషన్లు, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరం. పెద్దలతో చర్చలు, సమావేశాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన కీలక సమాచారం లభిస్తుంది. శుభవార్త అందుకుంటారు. సోదరీ సోదరుల విషయాలు ఉల్లాసం కలిగిస్తాయి.

వృషభం

ప్రయణాల కు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. సంక ల్పం ఫలిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

మిథునం

పూర్వమిత్రు లను కలుసుకుంటారు. మ్యూచువల్‌ ఫండ్స్‌, బ్యాంకు లావాదేవీలు లాభిస్తాయి. బీమా వ్యవహారాలకు అనుకూలం. ఆర్థిక వ్యవహారాలపై స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఆత్మావ లోకనం చేసుకునేందుకు తగిన సమయం.

కర్కాటకం

సమావేశాలు, బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో అనుబంధం ఏర్పడుతుంది. సినీ, రాజకీయ రంగాల వారు దూకుడు తగ్గించాలి. భాగస్వామి గురించి ఆలోచిస్తారు. లక్ష్య సాధనకు పరిచయాలు తోడ్పడతాయి.

సింహం

వైద్యం, హోటల్‌, రిటైల్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహ కరం. ఆహార నియమాలు పాటించాలి. బంధుమిత్రు లతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వైద్యానికి అవసరమైన నిధు లు సర్దుబాటవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.

కన్య

ఆర్థిక విషయాల్లో సంకల్పం నెరవేరుతుంది. నైపుణ్యాలను మెరుగుపరచుకుని లక్ష్యాలు సాధిస్తారు. చిట్‌ఫండ్‌లు, డిపాజిట్లపై ఆశించిన రాబడి నిరాశకు గురవుతారు. ప్రముఖులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

తుల

బదిలీల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యం సాధిస్తారు. బంధుమిత్రుల కలయికతో ఇంట్లో సందడిగా ఉంటుంది. ఇంటికి అవసరమైన వస్తువుల రవాణాకు అనుకూలం. సమావేశాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది.

వృశ్చికం

చెక్కులు, విలువైన డాక్యుమెంట్లు అందడంలో జాప్యం వల్ల నష్టపోతారు. సన్నిహితుల స్టేషనరీ, రవాణా, బోధన, ఏజెన్సీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. సోదరీ సోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం.

ధనుస్సు

ప్రియ తముల కోసం విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. భాగస్వామ్యాలు లాభిస్తాయి. స్నేహ పరిచయాల ఆధారంగా ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు అఽధికం.

మకరం

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూల సమయం. విందు, వినోదాలలో పరిమితి పాటించాలి. ఆరోగ్యం పట్ల శద్రఽ్ధ చూపించాలి. పరిశ్రమలు, వైద్య రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.

కుంభం

దూరంలో ఉన్న ప్రియతములు ఇల్లు చేర తారు. ప్రయాణాలు, చర్చలు, వేడుకల్లో కొంత అసౌకర్యం తప్పకపోవచ్చు సినీ, రాజకీయ, న్యా య రంగాల వారికి ఆర్థికంగా అనుకూలిస్తుంది. ప్రియతములకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు.

మీనం

వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. బంధు, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రదర్శనలు, సభలకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి గురించి ఆలోచిస్తారు.

To Top
error: Content is protected !!