భక్తిరసం

ఈ రోజు రాశి ఫలాలు 22 మే 2019!

22 may 2019 daily horoscopes in telugu
ఈ రోజు రాశి ఫలాలు 22 మే 2019!

మేషం

ఇంటర్వ్యూలలో విజయం సాధించేందుకు అధికంగా శ్రమించాలి. పెద్దలతో చర్చలు, సమావేశాల్లో ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పెద్దలను కలుసుకుంటారు. సంకల్పసిద్ధికి ప్రయత్నిస్తారు.

వృషభం

ఆర్థిక విషయాల్లో ప్రణాళిక లోపించడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సమావేశాలు, విద్య, ప్రయాణాలకు అవసరమైన నిధుల సర్దుబాటులో సమస్యలు ఎదురవుతాయి. ఫీజులు, ప్రయాణ ఏర్పాట్లకు ఖర్చు చేస్తారు.

మిథునం

ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. రుణాల మంజూరులో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. బీమా, పొదుపు పథకాలను సమీక్షించుకుంటారు. పన్నుల వ్యవహారాలపై దృష్టి సారిస్తారు.

కర్కాటకం

రాజకీయ, సినీరంగాల వారికి ప్రత్యర్థుల నుంచి ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీవారు, శ్రీమతి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వేడుకలు, ప్రదర్శనల్లో పాల్గొంటారు.

సింహం

సహకార లోపం కారణంగా వృత్తి, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. విందు వినోదాల్లో పరిమితి పాటించండి. సన్నిహితుల ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. వృత్తిపరమైన సమావేశాల్లో పాల్గొంటారు.

కన్య

చిన్నారులు, ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహపడతారు. చిట్‌ఫండ్స్‌, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విద్యార్థులకు శుభప్రదం.

తుల

బదిలీలు, మార్పులు నిరుత్సాహం కలిగిస్తాయి. ప్రయాణాలు, చర్చలు, సమావేశాల్లో అసౌకర్యం కలుగుతుంది. రియల్‌ఎస్టేట్‌, నిర్మాణ రంగాలవారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఫర్నిచర్‌ గురించి ఆరా తీస్తారు.

వృశ్చికం

సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది. బిల్లులు, చెక్కులు అందడంలో జాప్యం జరుగుతుంది. ప్రయాణాలు, చర్చల్లో నిదానం అవసరం. ఆర్థిక విషయాల్లో మాట నిలుపుకోవడం కష్టం. సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం.

ధనుస్సు

ఆర్థిక విషయాల్లో శ్రీవారు, శ్రీమతి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో నష్టం సంభవం. స్పెక్యులేషన్లలో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన వస్తువుల కొనుగోలు సమయంలో జాగ్రత్తలు తీసుకోండి.

మకరం

ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. సహోద్యోగుల వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించేందుకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.

కుంభం

సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు శుభప్రదం. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు సాధిస్తారు.

మీనం

ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. సమావేశాలు, ఊరేగింపుల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది.

To Top
error: Content is protected !!