భక్తిరసం

ఈ రోజు రాశి ఫలాలు 22 జనవరి 2019!

4 april 2019 daily horoscopes in telugu
ఈ రోజు రాశి ఫలాలు 22 జనవరి 2019!

మేషం

ప్రేమాను బంధాలు బలపడతాయి. విద్యా సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. విద్య, క్రీడలు, బ్యాంకు రంగాల వారికి ప్రోత్సాహకరం. సంకల్పం నెరవేరుతుంది. ఖర్చులు అధికం.

వృషభం

తలపెట్టిన పనులు కొలిక్కి వస్తాయి. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు, స్థలం మార్పు విషయంలో పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు ఊరటనిస్తాయి. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.

మిథునం

స్టేషనరీ, రవాణా, ఏజెన్సీ, రక్షణ, న్యాయ, బోధన, పర్యాటక రంగాల వారికి శుభప్రదం. వాహన సౌకర్యం కలుగుతుంది. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి లక్ష్యాలు సాధిస్తారు. కీలక సందేశాలు అందుకుంటారు.

కర్కాటకం

ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. షాపింగ్‌, క్రయ విక్రయాలకు అనుకూలం. రుణ ప్రయత్నాలు ఫలి స్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. వాయిదా పద్ధతులపై విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.

సింహం

వేడుకలు, సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. పందాలు, పోటీలు, స్పెక్యులేషన్లలో విజయం సాధిస్తారు. స్నేహానుబంధాలు బలపడతాయి. ఖర్చులు అధికం.

కన్య

చేపట్టిన పనులను సమీక్షించుకుంటారు. గత అనుభవంతో వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. డైటింగ్‌, యోగ ధ్యానాలపై దృష్టి పెడతారు. సహోద్యోగులకు సంబంధించిన రహస్య సమాచారం అందుకుంటారు.

తుల

ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పొదుపు పథకాల నుంచి మంచి ప్రతిఫలం అందుకుంటారు. స్నేహానుబంధాలు వికసిస్తాయి.

వృశ్చికం

గౌరవ పదవులు అందుకుంటారు. ప్రభుత్వ సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. ప్రమోషన్లు, బదిలీలు, మార్పు లకు అనుకూల సమయం. పెద్దల సహకారంతో వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు.

ధనుస్సు

ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. చర్చల్లో సత్ఫలితాలు సాధిస్తారు. కళలు, సాహిత్యం, ప్రణాళికలు, టూరిజం రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. డ్రైవింగ్‌లో నిదానం పాటించండి.

మకరం

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మూచ్యువల్‌ ఫండ్స్‌ లావాదేవీలు లాభిస్తాయి. బీమా, గ్రాట్యుటీ, పింఛన్‌ వ్యవహారాలకు అనుకూలం. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. విందుల్లో పాల్గొంటారు.

కుంభం

జన సంబంధాలు విస్తరిస్తాయి. పందాలు, పోటీలపై దృష్టి పెడతారు. భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు సంభవం. ప్రేమానుబంధాలు బలపడతాయి. న్యాయ, రక్షణ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఖర్చులు అధికం.

మీనం

ఆహార నియమాలు పాటిస్తారు. సహోద్యోగుల ఆంతరంగిక విషయాలపై దృష్టి పెడతారు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు కొలిక్కి వస్తాయి. పనివారి నియామకానికి అనుకూలం. వృత్తి, వ్యాపార విషయాలను సమీక్షించుకుంటారు.

To Top
error: Content is protected !!