భక్తిరసం

ఈ రోజు రాశి ఫలాలు 2 మే 2019!

2 may 2019 daily horoscopes in telugu
ఈ రోజు రాశి ఫలాలు 2 మే 2019!

మేషం

వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. సంకల్పం ఫలిస్తుంది. ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసేందుకు తగిన సమయం.

వృషభం

సినీ, రాజకీయ రంగాలవారు లక్ష్యాలు సాధిస్తారు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. అలజడి తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక ధృక్పథం పెరుగుతుంది. గతానుభవంతో లక్ష్యాలు సాధిస్తారు.

మిథునం

ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. ఆడిటర్లు, కన్స ల్టెంట్‌లకు అనుకూలం. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. సమావేశాలు, ప్రదర్శనలకు ఏర్పాట్లు చేస్తారు.

కర్కాటకం

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. న్యాయ, బోధన, రక్షణ రంగాల వారు గౌరవ పదవులు అందు కుంటారు.

సింహం

కీలక విష యాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. విద్యాసంస్థల్లో ప్రవేశం అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయు. రాజకీయ, బోధన, న్యాయ, రక్షణ రంగాల వారు ఉన్నత పదవులు అందుకుంటారు.

కన్య

ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బీమా, గ్రాట్యుటీ, పెన్షన్‌, మూచ్చువల్‌ ఫండ్‌ వ్యవ హారాలకు అనుకూలం. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. సంకల్పం ఫలిస్తుంది.

తుల

పూర్వ మిత్రులను కలుసుకుంటారు. స్పెక్యులేషన్లు, పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. శ్రీవారు, శ్రీమతి సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం

కొత్త పరిచయాలు లాభిస్తాయి. వృత్తిపరమైన సమావేశాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో భాగ స్వామి సహకారంతో లక్ష్యాల సాకారం. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. సన్నిహితుల ఆరోగ్యం మెరుగు పడుతుంది.

ధనుస్సు

సృజనాత్మకంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడ తాయి. వైద్యం, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు శుభప్రదం. చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం మెరుగు పడుతుంది.

మకరం

శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి శుభప్రదం. కుటుంబసభ్యుల వైఖ రి ఉల్లాసం కలిగిస్తుంది. ప్రియతముల కలయికతో ఇంట్లో సందడి గా ఉంటుంది.

కుంభం

ఒక వార్త ఉల్లాసం కలిగిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లకు అనుకూలం. సోదరీ సోదరుల విష యాల్లో శుభపరిణామాలు సంభవం. ఇంటికి అవస రమైన వస్తువులు సమకూర్చుకుంటారు. చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి.

మీనం

ఒప్పందాలకు అనుకూలం. బిల్లులు, చెక్కులు అందుకుంటారు. సన్నిహితుల సహకారంతో ఆర్థిక పరమైన లక్ష్యాలు సాధిస్తారు. విద్య, ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సా హకరం.

To Top
error: Content is protected !!