భక్తిరసం

ఈ రోజు రాశి ఫలాలు 15 మార్చి 2019!

4 april 2019 daily horoscopes in telugu
ఈ రోజు రాశి ఫలాలు 15 మార్చి 2019!

మేషం

పూర్వానుభవంతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. దూరంలో వున్న ప్రియతములు ఇల్లు చేరతారు. వేడుకలు, శుభకార్యాలకు సన్నాహాలు చేస్తారు. రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణరంగాల వారికి ప్రోత్సాహకం.

వృషభం

సోదరీసోదరులు, బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. స్నేహానుబంధాలు బలపడతాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. విలువైన పత్రాలు చేతికి అందుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితలు సహకరిస్తారు.

మిథునం

వేడుకల్లో పాల్గొంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పెద్దలను స్మరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. గౌరవ మన్ననలు అందుకుంటారు.

కర్కాటకం

బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కళలు, ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరం. సమావేశాలు, ప్రదర్శనల్లో కీలక పాత్ర పోషిస్తారు. కొత్త పనుల ప్రారంభానికి అనుకూలం. స్తబ్దత తొలగిపోయి మనసు ఉల్లాసంగా ఉంటుంది.

సింహం

వేడుకల్లో పాల్గొంటారు. దూరప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. వేడుకలు, ప్రదర్శనలు, పూర్వానుభవంతో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.

కన్య

వివాహ నిర్ణయాలకు అనుకూలం. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంస్థలు, బ్యాంకులతో పనులు పూర్తవుతాయి.

తుల

విందు, వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.

వృశ్చికం

ప్రకటనలు, ట్రావెల్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. సంకల్పం నెరవేరుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సమావేశాలు, వేడుకల్లో ప్రియతములను కలుసుకుంటారు.

ధనుస్సు

వేడుకలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. గృహ రుణాలు మంజూరవుతాయి. ఫర్నీచర్‌ సమకూర్చుకుంటారు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు.

మకరం

బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన కీలక పత్రాలు అందుకుంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి. రిజిస్ర్టేషన్లకు అనుకూలం. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది.

కుంభం

నపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల సహకారంతో ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. వైద్య చికిత్సలకు అవసరమయ్యే నిధులు సర్దుబాటవుతాయి. విందు వినోదాల కోసం ఖర్చు చేస్తారు.

మీనం

ప్రేమానుబంధాలు బలపడతాయి. వేడుకల్లో పాల్గొంటారు. సృజనాత్మకంగా వారికి ప్రోత్సాహకరం. చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభ పరిణామాలు సంభవం. శుభకార్యాలు ఉల్లాసం కలిగిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

To Top
error: Content is protected !!