భక్తిరసం

ఈ రోజు రాశి ఫలాలు 1 ఏప్రిల్ 2019!

today gold and silver costs in telugu 3 apri l2019
ఈ రోజు రాశి ఫలాలు 1 ఏప్రిల్ 2019!

మేషం

ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. సహకార సంఘాలు, యూనియన్‌ కార్యకాలాపాల్లో ఆశాభంగం తప్పకపోవచ్చు. బంధుమిత్రులతో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు.

వృషభం

పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలవల్ల అశాంతికి లోనవుతారు. ప్రభుత్వ రంగంలోనివారు అపవాదులు మోయాల్సిరావచ్చు. రాజకీయ, సినీరంగాల వారు నిదానం పాటించాలి.

మిథునం

ఆర్థిక విషయాల్లో అంచనాలు తప్పే అవకాశం ఉంది. సమావేశాల్లో శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. రక్షణ, న్యాయ, బోధన, రవాణా రంగాలవారు లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు.

కర్కాటకం

పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. రుణాలు, ఆర్థిక వ్యవహారాల్లో పెద్దల నుంచి సహకారం లోపిస్తుంది. వారసత్వ విషయాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. సంస్మరణలు, ఆరాధనల్లో పాల్గొంటారు.

సింహం

భాగస్వామి వైఖరి ఆవేదన కలిగిస్తుంది.సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. పందాలు, పోటీల్లో మీ అంచనాలు తప్పే ప్రమాదం ఉంది. వేడుకల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు.

కన్య

ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. హోటల్‌, వైద్యం, పరిశ్రమల రంగాలవారికి ఆర్థిక విషయాల్లో అనుకోని అవాంతరాలు ఎదురువుతాయి.

తుల

ప్రేమలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. చిన్నారులు, ప్రియతముల కోసం ఖర్చులు అధికం. పెట్టుబడుల్లో అచితూచి వ్యవహరించాలి. విద్యార్థులు పట్టుదలతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.

వృశ్చికం

వేడుకలకు ఏర్పాట్లలో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కుటుంబసభ్యుల ఆరోగ్యం కలవరపెడుతుంది. రియల్‌ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

ధనుస్సు

బోధన, రవాణా, ఏజెన్సీలు, కమ్యూనికేషన్‌ రంగాల వారికి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి. ఒక సమాచారం కలవరపెడుతుంది. ప్రయాణాలు, చర్చల్లో నిదానం అవసరం.

మకరం

ఆర్థిక విషయాల్లో కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పెట్టుబడులు, ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలకు తగిన సమయం కాదు. రియల్‌ఎస్టేట్‌ రంగంలోని వారు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

కుంభం

ప్రయాణాలు, చర్చల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఒక సమాచారం కలవరపెడుతుంది. సోదరీసోదరుల విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి. కీలక నిర్ణయాలను వాయిదా వేయండి. పిక్నిక్‌లు, పార్టీలు ఉల్లాసం కలిగిస్తాయి.

మీనం

రాజకీయ, సినీ రంగాలవారు ఆర్థిక విషయాల్లో చిక్కులు ఎదుర్కొంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సర్దుబాటు కాకపోవచ్చు. ఆర్థికవిషయాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. విరామ కాలక్షేపాలకు ఖర్చుచేస్తారు.

To Top
error: Content is protected !!