ఆంధ్ర ప్రదేశ్

జనసేన గెలిచే స్థానాలు ఇవేనా ..?

List of Total seats will JanaSena win in the 2019 elections
జనసేన గెలిచే స్థానాలు ఇవేనా ..?

ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ గెలిచే అసెంబ్లీ సీటు ఏదీ అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది బలంగా ఉన్న సీట్లు అంటే మాత్రం ఎలమంచిలి , గాజువాక, పాయకరావుపేట, పాడేరు వంటివి చెబుతారు. జనసేన ఇక్కడ గెలవడం మాట పక్కన పెడితే గట్టి పోటీ ఇస్తుంది. దాంతో ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతుందని మాత్రం భావించారు . అటువంటిది ఏకంగా పాయకరావుపేట సీటు ఆ పార్టీ గెలుస్తుందని నాయకులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిత ఉన్నారు. ఆమెకు పోటీగా పార్టీలో మరో వర్గం టికెట్ రేసులో ఉంది. సైకిల్ పార్టీలో గ్రూపులకు తగినట్లుగా వైసీపీలోనూ వర్గాలు ఉన్నాయి. మరి ఇవన్నీ చూసి జనసేన గెలుస్తుదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారా అనిపిస్తోంది. పాయకరావుపేట తూర్పు గోదావరి జిల్లాను ఆనుకుని ఉంది. గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం బాగానే ఉంది.

అక్కడ పవన్ సామాజిక వర్గం బలంగా ఉన్నారు. దాంతో అక్కడ అనేక సీట్లలో పార్టీకి బాగానే అభ్యర్ధులు ఉన్నారు. ఆ ప్రభావం ఆనుకుని ఉన్న పాయకరావుపేటపై పడుతుందని అంటున్నారు..ఇక ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు కూడా ఇక్కడ ఎక్కువ ఓట్లు తెచ్చుకుని ప్రధాన పార్టీలకు సవాల్ విసిరింది. ఆ ధీమాతోనే జనసేన నేతలు ఇపుడు గెలుపు అంటూ బల్ల గుద్ది చెబుతున్నారు.

ఇక అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపెల్లో వర్గ పోరు ఓ స్థాయిలో ఉంది. ఒక వర్గానికి టికెట్ ఇస్తే రెండవ వర్గం సహకరించే పరిస్థితి లేదు. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే అనితను తప్పిస్తే ఆమె వర్గం మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు కుమార్తె లక్ష్మి సహకరించదు. అనితకు టికెట్ ఇస్తే రెండవ వర్గం సహాయ నిరాకరణ చేయం ఖాయం. ఇక వైసీపీలో టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుని కాదని మరొకరికి టికెట్ ఇచ్చినా అక్కడా అసమ్మతి రేగడం ఖాయం.

ఈ పరిణామాలు మూడవ పార్టీగా జనసేనకు కలసి వస్తాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నట్లుగా ఉన్నారు. కాగా, జనసేన నుంచి అభ్యర్ధిగా నక్కా రాజబాబు కు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తం మీద పేట సీటుతో విశాఖ జిల్లాలో జాతకం మార్చుకోవాలని జనసేన భావిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో.

To Top
error: Content is protected !!