ఇంటర్నేషనల్

సౌదీ అరేబియాలో మ‌హిళ‌లు చేయ‌కూడ‌ని ప‌నులేంటో తెలుసా…..?

సౌదీ అరేబియా అంటే ఎన్నో కఠిన నియమాలు గుర్తొస్తాయి. ఇక ఈ దేశంలో మహిళలపై ఉండే వివక్ష అంతాఇంతా కాదు. ఇక్కడ ఎన్నో ఆక్షలుంటాయి. అయితే అక్కడి రాజు సల్మాన్ బిన్ అబ్దులజిజ్ అల్ సౌద్ ఇకపై సౌదీ మహిళలు డ్రైవింగ్ చేసుకోవచ్చని ప్రకటించడం అక్కడే పెద్ద సంచలనమే రేపింది. ఆ దేశ మహిళలు ఈ వార్త వినడంతో ఆనందానికి గురయ్యారు. ఎందుకంటే అక్కడున్న నిబంధనలు ఇంకెక్కడ ఉండవు. ఆ దేశ చరిత్రలో మొదటిసారిగా ఇటీవలే మహిళలను స్టేడియంలోకి అనుమతించారు. ఇక తర్వాత డ్రైవింగ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో అక్కడి మహిళల్లో చెప్పలేనంత ఆనందంగా కలుగుతుంది.ఇక్కడ మహిళలు కొన్ని దశాబ్దాలుగా తమకు డ్రైవింగ్ చేసుకునే అవకాశం ఇవ్వాలని అడుగుతూనే ఉన్నారు. తాజాగా డ్రైవింగ్ చేయకుండా వారిపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. ఇటీవల వారికి స్పోర్ట్స్ స్టేడియాలకు వెళ్లేందుకు కూడా అనుమతినిచ్చింది. వారు ఏదైనా పనిచేసుకోవడానికి గార్డియన్ అనుమతి అవసరం లేదని కూడా ప్రభుత్వం తెలిపింది. అలాగే ఓటు వేసే హక్కు కూడా మహిళలకు లభించింది. అయితే సౌదీలో మహిళలపై చాలా రూపాల్లో వివక్ష కొనసాగుతూనే ఉంది. సౌదీలో మహిళలు ఎక్కడికైనా వెళ్లాలన్నా వారి వెంట కచ్చితంగా వారికి సంబంధించిన మగవారు ఉండాలి. ప్రతి విషయంలో వారి వెంట జెంట్స్ ఉంటారు. తమ గార్డియన్స్ అనుమతి లేకుండా అక్కడ మహిళలు పెళ్లి చేసుకోకూడదు. విడాకులు ఇవ్వకూడదు. అలాగే పాస్ పోర్టు తీసుకోకూడదు. ప్రయాణాలు చేయకూడదు. వారి అనుమతి లేకుండా బ్యాంకులో ఖాతాలు కూడా తీసుకోకూడదు. వైద్యం కూడా చేయించుకోకూడదు. తమ బంధువులు కాని పురుషులతో కలసిమెలసి తిరగకూడదు. లీగల్ మేల్ గార్డియన్ అనే వ్యక్తి లేకుండా అక్కడి మహిళలు ఏ పని చేయకూడదు. అక్కడి మహిళలకు తండ్రి, తర్వాత అన్నదమ్ములు, భర్త, కొడుకులే సాధారణంగా గార్డియన్‌గా ఉండి తీరాలి.సౌదీ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తల నుంచి కాళ్ల దాకా బురఖా ధరించాలి. మహిళలకు సంబంధించిన ఏ భాగం కూడా బయటకు కనపడకూడదు. తమ శరీర భాగాలు ఎంత వరకూ బయటకు కనపడాలో అక్కడ ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. అలాగే వారు వేసుకునే మేకప్ విషయంలో కూడా పరిమితులు ఉంటాయి.
ముస్లిమేతరులను పెళ్లి చేసుకోకూడదు. సున్నీ శాఖ మహిళలు షియానుగాని, కమ్యూనిస్టునుగాని, నాస్తికుణ్నిగాని పెళ్లి చేసుకోకూడదు. కొన్ని రకాల వ్యాపారాలు చేయకూడదు. అప్పు తీసుకోవాలన్నా, ఏదైనా లైసెన్సు తీసుకోవాలన్నా ఆమె వ్యక్తిత్వం మచ్చలేనిదని ఇద్దరు పురుషులు ధ్రువీకరించాల్సి ఉంటుంది.అక్కడ అమ్మాయిలు పబ్లిక్ లో స్విమ్మింగ్ చేయకూడదు. స్విమ్మింగ్ పూల్స్ లో కేవలం అబ్బాయిలు మాత్రమే ఈతపడాలి. పబ్లిక్ జిమ్, పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ లో వీరికి అనుమతి లేదు. అయితే మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిమ్స్ కు, పూల్స్ కు మహిళలు వెళ్లొచ్చు.బయట వ్యక్తులతో అక్కడి మహిళలు మాట్లాడకూడదు. కొత్తగా తీసుకొని వస్తున్న డ్రైవింగ్ పాలసీ ద్వారా పోలీసులు మహిళలతో ఎలా మాట్లాడాలో అనే విషయంపై కూడా ఇంకా అక్కడ స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు ఇక్కడ ఆసుపత్రుల్లో, బ్యాంకుల్లోనూ అక్కడ ఉండే లేడీ స్టాఫ్ తో మాత్రమే అక్కడి మహిళలు మాట్లాడాలి. మహిళలకు సౌదీ అరేబియా ఇటీవల ఒక స్వేచ్ఛ ఇచ్చింది. స్టేడియాల్లో జరిగే క్రీడా పోటీలను మహిళలు వీక్షించొచ్చు. అమ్మాయిలు స్టేడియాలకు వెళ్లేందుకు గతంలో అక్కడ అనుమతి ఉండేది కాదు. అక్కడి మహిళలు వారి కుటుంబ సభ్యులతో కలిసి కూర్చునేందుకు వీలుగా అక్కడి స్టేడియాల్లో త్వరలోనే మార్పులు చేర్పులు చేపట్టారు. ప్రస్తుతానికి అక్కడ మగవాళ్లకు మాత్రమే స్టేడియాల్లోకి ప్రవేశం ఉంది.ఇక నుంచి ఆ దేశంలోని రియాద్, జెడ్డా, డామన్ నగరాల్లోని మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి స్టేడియాలకు వెళ్లొచ్చు. 2012 లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో సౌదీ అరేబియా తరఫున ఇద్దరు మహిళలు బరిలోకి దిగారు. అయితే ఈ తర్వాత జరిగిన క్రీడలకు మళ్లీ ఇక్కడి నుంచి మహిళలు వెళ్లలేదు. సాధారణంగా మనం షాపింగ్ వెళ్లిననప్పుడు అక్కడి దుస్తుల కొనాలంటే ట్రై చేస్తుంటాం. అయితే సౌదీలో మాత్రం ఆడవాళ్లు ఇలా వారు కొనే దుస్తుల్ని ట్రయల్ రూమ్ కి వెళ్లి చెక్ చేసుకోకూడదు. అక్కడ వారు అలా చేస్తే నేరం. ఆడవారు అలా చేయడం కుదరదు. మహిళలు బయట షాపుల్లో ఉండే ట్రయల్ రూమ్స్ లో బట్టలు వేసుకోకూడదని అక్కడ రూల్ ఉంది.

To Top
error: Content is protected !!