ఇంటర్నేషనల్

పడిలేచిన స్టాక్ మార్కెట్ సూచీలు!

sensex double century
పడిలేచిన స్టాక్ మార్కెట్ సూచీలు!

గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభంలో బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య పోటీ హోరాహోరీగా సాగడంతో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో ఓ దశలో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 867 పాయింట్ల మేర నష్టపోయి 33 వేల పాయింట్లకు దిగువుననకు పడిపోయి 32, 596 పాయింట్లుగా నమోదయ్యింది. అటు నిఫ్టీ కూడా 258 పాయింట్ల మేర నష్టపోయి 10,075 పాయింట్లుగా నమోదయ్యింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 410 పాయింట్లు లాభపడింది. అటు ఫోరెక్స్‌లో రూపాయి మారకం విలువ కూడా పతనమయ్యింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 68 పైసలు నష్టపోయి 64.72గా నమోదయ్యింది. అయితే ఆ తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ దిశగా దూసుకెళ్లడంతో మళ్లీ మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు పుంజుకుని నష్టాలను భర్తీ చేసుకున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్ల మేర, నిఫ్టీ 100 పాయింట్ల మేర లాభపడింది. కొద్ది సేపటి క్రితం సెన్సెక్స్ 296 పాయింట్ల లాభంతో 33, 759 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుండగా…నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 10,431 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఎస్బీఐ, రిలయన్స్, మారుతి సుజుకి, హెచ్‌డీఎఫ్సీ, మహీంద్ర అండ్ మహీంద్ర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

To Top
error: Content is protected !!